Telanganapatrika (June 28): CM Revanth. 2029లో తెలంగాణ రాష్ట్రంలో నియోజకవర్గాల పునర్విభజన జరగనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. శాసనసభ నియోజకవర్గాల పరిమాణంలో మార్పులు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దిశగా ఏర్పాట్లు చేస్తోంది.

ఖైరతాబాద్ చరిత్రను గుర్తుచేసిన CM Revanth..
ఒకప్పుడు ఖైరతాబాద్ నియోజకవర్గం విస్తారంగా ఉండేది. 2009 పునర్విభజనలో ఇది ఖైరతాబాద్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి మరియు అంబర్‌పేట నియోజకవర్గాలుగా విడిపోయింది. ఇప్పుడు అదే మాదిరిగా శేరిలింగంపల్లి ప్రాంతాన్ని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుగా విభజించే అవకాశముందన్నారని CM చెప్పారు.
ప్రజాప్రతినిధుల అవకాశాలు పెరుగుతాయి..
“ఒక్క నియోజకవర్గం నుండి నలుగురు లేదా ఐదుగురు ఎమ్మెల్యేలను తయారుచేయడానికి ఈ పునర్విభజన ఉపయుక్తంగా ఉంటుంది” అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. జనాభా పెరుగుదల, పట్టణ విస్తరణ నేపథ్యంలో, ప్రజల ప్రాతినిధ్యం మెరుగుపడాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
రాజకీయ ప్రణాళికలకు దోహదం..
2029లో జరిగే ఎన్నికలలో ఈ కొత్త నియోజకవర్గాల రూపరేఖలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల నియోజకవర్గ స్థాయిలో రాజకీయ వ్యూహాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu