Telanganapatrika (July 09): CM రేవంత్ తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ప్రతిపక్ష నాయకుడు KCR అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నారని చెబుతుంటే, రేవంత్ కూడా అదే స్ఫూర్తితో స్పందించారు. “కెసిఆర్ ఏ తేదీ అంటారో, మేము అసెంబ్లీలో చర్చకు సిద్ధం. అవసరమైతే నిపుణులను కూడా సభకు తీసుకువస్తాం. చర్చ అంటే అసెంబ్లీలో జరగాలి… పబ్బుల్లో కాదు.” అని స్పష్టం చేశారు.

“ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో కూడా మాక్ అసెంబ్లీ చేస్తాం. మా మంత్రులను పంపుతాం. అవసరమైతే నేనూ వస్తా. కానీ నన్ను దయచేసి పబ్బులు, క్లబ్బుల్లో చర్చలకు పిలవొద్దు. ఎవరు ఎక్కడ పెరిగారో, వాళ్ల మాటలు అలా ఉంటాయి.” అంటూ రేవంత్ కౌంటర్ ఇచ్చారు.
Read More: Read Today’s E-paper News in Telugu