Telanganapatrika (July 07): CM Revanth, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా నిలిచిన జులై 7 తేదీని మరోసారి గుర్తు చేసుకున్నారు. 2021లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవిని స్వీకరించిన రోజుని ఆయన చారిత్రాత్మకంగా అభివర్ణించారు.

ముఖ్యమంత్రి రేవంత్ మాటల్లోనే:
జులై 7ను జీవితంలో మరిచిపోలేను. నియంతృత్వాన్ని సవాల్ చేసి, నిర్బంధాన్ని ప్రశ్నించి, స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన సందర్భం అది.
నేటి ప్రజాపాలనకు నాడు సంతకం చేసిన సంకల్పదినం.
సోనియా గాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ అండతో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను,”
అని X (మాజీ Twitter) లో రాసుకొచ్చారు.
CM Revanth ఆ రోజు, ఈ రోజు – ఓ విశ్లేషణ:
- 2021 జులై 7: టీపీసీసీ పదవిని చేపట్టిన రోజు
- 2023 డిసెంబర్: తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం
- మూడు సంవత్సరాల్లో రాజకీయంగా భారీ ప్రస్థానం
Read More: Read Today’s E-paper News in Telugu