Telanganapatrika (జూలై 19) : CM Relief Fund Help to Poor 2025 – వనపర్తి జిల్లా జ్యోతికి కిడ్నీ చికిత్స కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేసిన సీఎం సహాయ నిధి.

- నిరుపేదలకు దేవుడిచ్చిన వరం. సీఎం రిలీఫ్ ఫండ్
- మంత్రివర్యులు వాకిటి శ్రీహరి
CM Relief Fund Help to Poor 2025.
వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల పరిధిలోని బాల కిష్టాపురం గ్రామంలో శనివారం అదే గ్రామానికి చెందిన నేనావత్ జ్యోతికి రెండు కిడ్నీలు పాడైపోవడంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జ్యోతి కి సీఎం సహాయ నిధి నుండి 5 లక్షల రూపాయలు మంజూరైన ఎల్ వో సి పత్రాన్ని మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నిరుపేదలకు ఇస్తున్న వరమని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
జ్యోతమ్మకు సీఎం సహాయనిధి నుండి 5 లక్షల రిలీఫ్ ఫండ్ అందించిన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి
Read More: Green Day Celebration in Schools 2025 – బ్లూ బెల్స్ స్కూల్‌లో పచ్చదనోత్సవం