CM Relief Fund Cheques Telangana : వేములవాడలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

TELANGANA PATRIKA (MAY 8) , CM Relief Fund Cheques Telangana: ప్రజా ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆసరాగా నిలుస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో, రూ. 19.99 లక్షల విలువైన 53 చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

Join WhatsApp Group Join Now

CM Relief Fund Cheques Telangana ఆరోగ్య శ్రీ పథకంలో విస్తరణ:

ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ , ప్రజా ప్రభుత్వం హయాంలో ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడమేగాక, గతంలో ఎవరికీ తెలియని ఎల్విసి (LOC) లను పెద్ద సంఖ్యలో మంజూరు చేసి పేదలకు ఉపయోగపడే విధంగా చొరవ చూపించామన్నారు. ఇప్పటివరకు రూ. 20 కోట్లకు పైగా సహాయ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

వైద్య సదుపాయాల అభివృద్ధి :

వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.

రుద్రంగి, ఫాజుల్ నగర్ మండలాల్లో రూ. 1.43 కోట్లతో ఆసుపత్రుల నిర్మాణం కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

రైతుల సమస్యలపై స్పందించిన ఆది శ్రీనివాస్..రైతుల కోసం ప్రభుత్వం పూర్తి సహకారంతో

  • వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగంగా సాగుతోంది.
  • తడిసిన ధాన్యాన్ని కూడా తప్పకుండా కొనుగోలు చేస్తామన్నారు.
  • కొందరు రైతుల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారిని ప్రజలు గుర్తించాలన్నారు.
  • ఇంటర్ మిడియట్ గోదాంలలో ధాన్యం నిల్వ చేస్తూ వారం, పది రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు.

కొనుగోలు గణాంకాలు:

సంవత్సరం మే 6 నాటికి కొనుగోలు చేసిన ధాన్యం

2021-22 (BRS హయం)1,215 మెట్రిక్ టన్నులు
2022-23 (BRS హయం)32,915 మెట్రిక్ టన్నులు
2023-24 (ప్రజా ప్రభుత్వం)91,560 మెట్రిక్ టన్నులు
2024 -25(ప్రస్తుతం)1,12,405 మెట్రిక్ టన్నులు

ఇది రైతులకు ప్రభుత్వం ఇచ్చే అండను స్పష్టంగా చూపిస్తోంది అన్నారు.

రాజన్న ఆలయ విస్తరణపై స్పందన:

రాజన్న ఆలయ అభివృద్ధిని పద్ధతిగా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కొనసాగిస్తున్నామని అన్నారు. త్వరలో టెండర్లు పూర్తయి అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి అని తెలిపారు.

Also Read : Government Schools Telangana: సంగారెడ్డి పాఠశాలల్లో తప్పనిసరి టాయిలెట్లు నిర్మాణం – కలెక్టర్ వల్లూరు క్రాంతి కీలక ఆదేశాలు

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →

Comments are closed.