Class X Pre Final Exams Telangana: తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు కీలక సమాచారం. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ క్లాస్ X ప్రీ-ఫైనల్ పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరగనున్నాయి.

ప్రీ-ఫైనల్ పరీక్షలు ఫిబ్రవరి 17న మొదటి భాష పరీక్షతో ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత
ఫిబ్రవరి 18న రెండో భాష , ఫిబ్రవరి 19న మూడో భాష పరీక్షలు నిర్వహిస్తారు.
- ఫిబ్రవరి 20న గణితం,
- ఫిబ్రవరి 21న భౌతిక శాస్త్రం,
- ఫిబ్రవరి 23న జీవ శాస్త్రం,
- ఫిబ్రవరి 24న సాంఘిక శాస్త్రం పరీక్షతో ప్రీ-ఫైనల్స్ ముగుస్తాయి.
సమయ పరంగా చూస్తే, భౌతిక శాస్త్రం మరియు జీవ శాస్త్రం పరీక్షలు ఉదయం 9:30 నుంచి 11:00 గంటల వరకు మాత్రమే జరుగుతాయి. మిగతా అన్ని సబ్జెక్టుల పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డా. ఈ. నవీన్ నికోలస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు ముగిసిన వెంటనే అన్సర్ షీట్ల మూల్యాంకనం వేగంగా పూర్తి చేయాలని, అలాగే విద్యలో వెనుకబడి ఉన్న విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మండల విద్యాధికారులు, హెడ్మాస్టర్లకు సూచించారు.
Class X Pre Final Exams Telangana
మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న SSC పబ్లిక్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు ప్రీ-ఫైనల్ పరీక్షలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. అలాగే పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగేలా అన్ని పాఠశాలలు షెడ్యూల్ను కచ్చితంగా పాటించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Read More: Read Today’s E-paper News in Telugu
