TELANGANA PATRIKA (MAY 12) , ఈనెల 13వ తేదీ ఉదయం 6:00 గంటల నుంచి 28వ తేదీ ఉదయం వరకు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఈ మేరకు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు.


సిటీ పోలీస్ యాక్ట్ నిషేధాజ్ఞల అమలు వివరాలు:
పోలీస్ యాక్ట్ 7(1) 2016, సెక్షన్ 22, 30 (1861) Police Act ప్రకారం ఈ నిషేధం
- ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు అనుమతి లేకుండా నిషిద్ధం
- కార్యాలయాల మూసివేతకు బెదిరింపులు చేస్తే చట్టపరమైన చర్యలు
- డీజే సౌండ్ వినియోగంపై నిషేధం:
DJ సౌండ్, మైక్ సెట్ వినియోగంపై నిషేధాజ్ఞలు - Noise Pollution Rules 2000, Police Act 1861 ప్రకారం నిషేధం
చిన్న పిల్లలు, వృద్ధులు, విద్యార్థుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం
అత్యవసరమైతే డివిజన్ ACP అనుమతి తప్పనిసరి
నిబంధనలు ఉల్లంఘిస్తే:
Section 223 BNS, Section 70(A)(B)(C), Section 76 ప్రకారం కేసులు నమోదు
సిటీ పోలీస్ యాక్ట్ 1348 ఫాస్లి సెక్షన్ 30 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చరిక
పోలీసుల సూచనలు:
కమిషనర్ అనురాధ పేర్కొంటూ…
“శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. అందరూ సహకరించాలని ప్రజలను కోరుతున్నాం.”
Also Read : జాతీయ రహదారి విస్తరణతో అభివృద్ధికి బాటలు: ఎంపీ రఘునందన్ రావు సమీక్ష
One Comment on “సిద్దిపేటలో ఈనెల 28 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలు: కమిషనర్ డాక్టర్ బి. అనురాధ”