Chinese Manja Ban Hyderabad: చైనీస్ మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు అని సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. మనుషులకే కాకుండా పక్షులు, జంతువులకు ప్రాణాంతకంగా మారుతున్న ఈ మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని గాలిపటాల దుకాణాల యజమానులకు సూచించారు.

మంగళవారం రోజు డీసీపీ రక్షిత కృష్ణమూర్తి, అదనపు డీసీపీ నరసయ్య, ఏసీపీ శశాంక్ రెడ్డిలతో కలిసి వారసిగూడ ప్రాంతంలోని పలు గాలిపటాల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలు చిలకలగూడ, వారసిగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగాయి.
Chinese Manja Ban Hyderabad తనిఖీల సమయంలో దుకాణాల్లో అమ్ముతున్న గాలిపటాల దారాలను (మాంజా) పరిశీలించిన డీసీపీ, ప్రమాదకరమైన చైనీస్ మాంజా లభిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటివరకు తనిఖీ చేసిన దుకాణాల్లో చైనీస్ మాంజా లభించలేదని ఆమె వెల్లడించారు.
ఇక యువత, ప్రజల్లో చైనీస్ మాంజా వల్ల జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని, ముఖ్యంగా యువకులు ఈ మాంజాను వాడకూడదని సూచించారు. భవిష్యత్తులో కూడా గాలిపటాల దుకాణాలపై పోలీసుల నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో ఇన్‌స్పెక్టర్లు అనుదీప్ (చిలకలగూడ), మధుసూదన్ రెడ్డి (వారసిగూడ), అలాగే సబ్ ఇన్‌స్పెక్టర్లు రామచంద్ర రెడ్డి, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.
Read More: Read Today’s E-paper News in Telugu
