Bonalu Celebrations 2025 – ఆనంద్ విద్యానికేతన్ స్కూల్‌లో బోనాల వేడుక

Telanganapatrika (July 16) : Bonalu Celebrations 2025 – ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ లో విద్యార్థులు ఘనంగా బోనాల పండుగ జరుపుకున్నారు.

Join WhatsApp Group Join Now

Bonalu Celebrations 2025 - Bonalu Celebration at Anand Vidyaniketan High School in Rajanna Siricilla, 2025

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండల కేంద్రంలోని ఆనంద్ విద్యానికేతన్ హై స్కూల్ లో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ రోజు స్కూల్ టీచర్లు, విద్యార్థులు బోనాలు తీసుకొని పోచమ్మ దేవాలయం కు వెళ్లి మొక్కలు చెల్లించుకున్నారు. పిల్లలు పోతారాజుల వేశాధారణ చేసుకొని నృత్యాలు చేస్తూ, విద్యార్థులు డ్యాన్స్ లు చేస్తూ గ్రామ ప్రజలను ఆకట్టుకున్నారు.

ఈ సందర్బంగా ఆనంద్ విద్యానికేతన్ పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, తెలంగాణలో బోనాల పండగ ఒక విశిష్టతను విద్యార్థులకు వివరించడం జరిగిందని తెలిపారు. అలాగే ఈ పండుగను ఆషాఢ మాసంలో ప్రారంభించి శ్రావణ మాసం చివరిదాకా జరుపుకుంటామని వివరించారు. వర్షాలు బాగా కురవాలని, పాడి పంటలు అభివృద్ధి చెందాలని, ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా సుఖంగా ఉండాలని కోరుతూ పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించినట్టు తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పోతరాజు విన్యాసాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఉద్యోగాలు మరియు తాజా తెలంగాణ న్యూస్ కోసం సందర్శించండి: Telangana Patrika – www.telanganapatrika.in

One Comment on “Bonalu Celebrations 2025 – ఆనంద్ విద్యానికేతన్ స్కూల్‌లో బోనాల వేడుక”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *