TELANGANA PATRIKA (MAY 10) , Bomb Squad Inspections : భద్రతా పరంగా జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, నాంపెళ్లి దేవాలయం, మిడ్ మానేర్ డ్యామ్, బస్టాండ్లు తదితర ప్రదేశాల్లో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విశేష తనిఖీలు చేపట్టారు.

Bomb Squad Inspections పోలీసుల స్పష్టమైన హెచ్చరిక…
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ, “ప్రజల రక్షణే మాకు ప్రాధాన్యం. బస్టాండ్లు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ప్రత్యేక బలగాలతో నిఘా కొనసాగుతోంది,” అని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 నెంబర్‌కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఫేక్ న్యూస్‌లపై హెచ్చరిక..
సోషల్ మీడియాలో అనధికారికంగా వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని, అధికారికంగా ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ ఇచ్చే సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనధికారిక సమాచారం షేర్ చేయడం శిక్షార్హం అవుతుందని హెచ్చరించారు.
Bomb Squad Inspections భద్రతా చర్యలు కొనసాగుతాయి
వేములవాడ వంటి ప్రజల సందడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. భద్రతకు ప్రజల సహకారం అత్యంత అవసరం అని స్పష్టం చేశారు.
Also Read : Drunk and Drive Counseling Telangana: వేములవాడలో వాహనదారులకు పోలీసుల అవగాహన కార్యక్రమం
Comments are closed.