Telanganapatrika (July 28): BJP Vemulawada Meeting, ఈరోజు బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల కొరకు ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాల్లోకి వెళ్లి బిజెపి కార్యకర్తలను గెలిపించుకోవడానికి కృషి చేయాలని పిలుపునియ్యడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రతాప రామకృష్ణ గారు విచ్చేసి గ్రామ గ్రామంలో బీజేపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని తెలియజేశారు ఈ సందర్భంగా బుధవారం రోజున అనగా 30 7 2025 రోజున హరిహర వీరమల్లు సినిమా సనాతన ధర్మాన్ని చక్కగా వివరించడం జరిగింది హిందుత్వం ఐక్యత ఎంత అవసరమో తెలియజేస్తున్న సినిమాను అని బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నాలుగు షోలు ఉచిత ప్రదర్శన ఇవ్వడం జరుగుతుందని పట్టణంలోని అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని కుటుంబ సమేతంగా ఈ సినిమాను వీక్షించి హిందు ధర్మం సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు పాత్రులు కాగలరని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
Read More: 85 జతల రాజన్న కోడెల పంపిణీ : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా..
