
గంగాధర ఆగస్టు 24 (తెలంగాణ పత్రిక ) BJP leaders arrested : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదివారం గంగాధర మండల పరిధిలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త చర్యలలో భాగంగా పోలీసులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు. మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఉండేందుకు స్థానికంగా ఉన్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకొని వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.