Telanganapatrika (July 24): సిరిసిల్ల ల్లో బైక్ చోరీల గుట్టు రట్టు, సిరిసిల్ల జిల్లా , తంగళ్లపల్లి మండలంలో ఇటీవల కాలంలో కొనసాగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలపై పోలీసు విభాగం కఠినంగా స్పందించింది.బుధవారం సిరిసిల్ల రూరల్ సీఐ కె.మొగిలి తెలిపిన వివరాల ప్రకారం తంగళ్లపల్లి ఎస్సై ఎం.ఉపేంద్ర చారి మరియు సిబ్బంది చాకచక్యంగా దర్యాప్తు చేపట్టి ముగ్గురు దొంగల గ్యాంగ్‌ను గుర్తించి వారిలో ఇద్దరిని అరెస్టు చేశారు.ఒకరు పరారీలో ఉన్నారు.అరెస్టు చేసిన దొంగలు తంగళ్లపల్లి, ముస్తాబాద్, మాచారెడ్డి, సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో గత ఏడు నెలలుగా 10 బైకులు దొంగలించినట్టు పోలీసులు గుర్తించారు.

సిరిసిల్ల ల్లో బైక్ చోరీల గుట్టు రట్టు 10 బైకులు స్వాధీనం..
దొంగతనం చేసిన కొన్ని వాహనాలను చందుర్తి, కరీంనగర్, సిరిసిల్ల ప్రాంతాల్లో తక్కువ ధరలకు విక్రయించినట్టు వెల్లడైంది. వాహనాలు కొనుగోలు చేసిన వారిపై కూడా కేసులు నమోదు చేసి, బైకులను స్వాధీనం చేసుకున్నారు.
ఆడెపు రవికుమార్, తండ్రి శ్రీనివాస్, పద్మశాలి కులం, బీవై నగర్, సిరిసిల్ల నివాసితుడు మరో వ్యక్తి వివరాలు వెల్లడించబడలేదు. పరారీలో ఉన్న మూడో వ్యక్తిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఈ కేసును చురుకైన దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసిన తంగళ్లపల్లి ఎస్సై,హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, బాలనరసయ్య, కానిస్టేబుల్ నరేందర్, రామ్మోహన్, వికాస్ లను సీఐ అభినందించారు.వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లతో సహా నంబర్ ప్లేట్లు తప్పనిసరిగా ఉండాలని, ఏ వ్యక్తీ డాక్యుమెంట్లు లేని బైక్‌ను కొనుగోలు చేస్తే అతనిపైనా కేసు నమోదు అవుతుందని ఎస్సై ఈ సందర్భంగా హెచ్చరించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
