Advertisement

bhu bharathi Act: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన “భూభారతి” పోర్టల్ 2025

తెలంగాణ పత్రిక (APR.14) : bhu bharathi Act భూభారతి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భూభారతి పోర్టల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శిల్పకళా వేదిక, హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఈ పోర్టల్ ప్రయోగాత్మకంగా నాలుగు మండలాల్లో ప్రారంభించనున్నారు. వీటిలో:

  • మద్దూరు (నారాయణపేట జిల్లా)
  • లింగంపేట (కామారెడ్డి జిల్లా)
  • వెంకటాపూర్ (ములుగు జిల్లా)
  • నేలకొండపల్లి (ఖమ్మం జిల్లా)

ఈ కార్యక్రమాన్ని జూన్ 2నాటికి రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని లక్ష్యంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Advertisement
bhu bharathi Act భూభారతి :

పౌరుల నుంచి సూచనలు తీసుకుని అవసరమైన మార్పులు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజల స్పందన ఆధారంగా భూభారతి పోర్టల్‌ను తరచూ నవీకరించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఈ పోర్టల్ ద్వారా భూ సంబంధిత సమాచారం మరింత సులభంగా, పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఇది డిజిటల్ తెలంగాణ వైపుగా మరో కీలక అడుగుగా పరిగణించబడుతోంది.

Read also: Bhu Bharathi Act 2025 – ధరణికి బదులుగా తెలంగాణ కొత్త భూ చట్టం

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →