Bhimeshwara Swamy Temple: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర 2026 (జనవరి 28 నుంచి 31 వరకు) నేపథ్యంలో భక్తుల రద్దీ భారీగా పెరగనుండటంతో, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర (24 గంటల) దర్శనం అందించాలని నిర్ణయించారు.

మేడారం వెళ్లే భక్తులు ముందుగా శ్రీ భీమేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆపై జాతరకు వెళ్లడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో, రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న భీమేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ క్రమంలో, జనవరి 4, 11 మరియు 18 తేదీల్లో (మూడు ఆదివారాలు) భీమేశ్వర స్వామి ఆలయం రోజంతా తెరిచి ఉంచనున్నారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎల్. రమాదేవి మాట్లాడుతూ, భక్తుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Bhimeshwara Swamy Temple భక్తుల కోసం క్యూలైన్లలో
తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయడంతో పాటు,
- కోడె మొక్కులు
- అభిషేకాలు
- అన్నపూజలు
సజావుగా నిర్వహించేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. అలాగే, పోలీసు శాఖతో సమన్వయం చేసి భద్రతా ఏర్పాట్లు కూడా బలోపేతం చేశారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు, మేడారం జాతరకు వెళ్లే యాత్రికులు ఈ నిరంతర దర్శన సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆలయ మార్గదర్శకాలను పాటిస్తూ శాంతియుతంగా దర్శనం చేసుకోవాలని సూచించారు.
ఈ నిర్ణయంతో మేడారం జాతర సమయంలో భీమేశ్వర స్వామి ఆలయంలో రద్దీ తగ్గి, భక్తులకు హాసిల్-ఫ్రీ దర్శన అనుభవం లభించనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
