Telanganapatrika (August 09 ) :Best Teacher Award, ప్రతి సంవత్సరం Day Spring Theological University, Texas, USA మరియు GSHTA Academy సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక రంగంలో విశిష్టంగా సేవలందిస్తున్న ప్రముఖులకు Honorary Doctorate Awards ప్రదానం చెసారు .

ఈ సంవత్సరం, విద్యా రంగంలో విలక్షణంగా సేవలందిస్తున్న శ్రీ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ గారిని గుర్తించి, ఆయనకు ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం చేయడం జరిగింది.
శ్రీ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ 2009-2010 వ సంవత్సరo లో వేదం ఉన్నత పాఠశాల ప్రారంభించినప్పటి నుండి ఎంతో విలువలతో కూడిన విద్యను అతి తక్కువ ఫీజులతో పేద విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ పోటీ యుగములో కూడా దేనిలోనూ రజీపడకుండ తక్కువ ఫీజులతోనే ఐఐటీ/ నీట్ లాంటి నేటి విద్యను అందిస్తున్నారు. పాఠశాలలో వేదిక్ గణితము మరియు అబాకస్ లాంటి ఎన్నో పోటీ పరీక్షలను నిర్వహిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారు. ఎలాంటి ప్రత్యేకమైన ఫీజులు తీసుకోకుండా శారీరక దృఢత్వం కోసం, మానసిక స్థితిని పెంచడం కోసం కరాటే యోగా లాంటి వాటిలో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం పాఠశాలలో 20 నుండి 30 మంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తూ పేద విద్యార్థులను ఎంతోమందిని డాక్టర్లుగా,ఇంజనీర్లుగా మరియు ప్రభుత్వ ఉద్యోగులుగా చేయడంలో కృషి చేశారు. ప్రతి విద్యార్థికి మన సంస్కృతి సాంప్రదాయాల పైన మంచి అవగాహన కల్పిస్తూ ప్రతిదినము ఏదో ఒక కొత్త పరవడితో విద్యను అందిస్తూ 16 సంవత్సరాలుగా నిర్విరామంగా విద్యార్థులకు సేవ చేస్తూ ఉన్నారు.
Best Teacher Award.
ఈ సేవాలను గుర్తిస్తూ డే స్ప్రింగ్ థియోలాజికల్ యూనివర్సిటీ, టెక్సాస్, USA మరియు GSHTA అకాడమీ వారు గౌరవ డాక్టరేట్ అందిస్తున్నారు.
ఈ సందర్భంగా Day Spring Theological University, Texas USA మరియు GSHTA Academy’s Chairman & Director అయిన డా. ఎమ్.వి. ప్రసాద్ గారు మాట్లాడుతూ “శ్రీ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ గారు నవ సమాజ నిర్మాణం కోసం ఎంతోమంది పేద విద్యార్థులను భావితరాలకు తక్కువ ఫీజులతో ఎంతో నాణ్యమైన విద్యను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతూ భారతదేశానికి ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు “
ఈ కార్యక్రమానికి సినీరంగ ప్రముఖులు శ్రీ అప్పారావు జబర్దస్త్, ఘర్షణ శ్రీనివాస్ సీనియర్ నటి శ్రీమతి జానకి సంధ్య గారు మరియు సామాజిక సేవకులు ప్రిత్వీరాజు గారు గెస్ట్ ఆఫ్ హానర్‌గా హాజరయ్యారు. వీరితో పాటు 25 ప్రముఖులను వివిధ రంగాల్లో విశిష్ట సేవలను అందించిన వారికి కూడా గౌరవ డాక్టరేట్ అందించి గౌరవించారు.
ఈ అవార్డు ప్రదానోత్సవం సూర్యలోక్ కాంప్లెక్స్, అబిడ్స్, హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా డా. శ్రీ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ “ఈ అవార్డు నా బాధ్యతను ఇంకా పెంచింది. విద్యా రంగంలో ఇంకా ఎక్కువ మందికి శాస్త్రీయ మార్గదర్శనం అందించే ప్రేరణగా ఈ గుర్తింపు నిలుస్తుంది.”