Telanganapatrika (July 15) : BC Reservations Dharna 2025 – బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరమ్ ఆధ్వర్యంలో ఇంద్రపార్క్ వద్ద ధర్నా.

BC Reservations Dharna 2025.
- బీసీ ప్రజా ప్రతినిధులు ఫోరం ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా
- ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
కుత్బుల్లాపూర్: బీసీ ప్రజా ప్రతినిధుల ఫోరమ్ (BCPF) ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో చట్టబద్ధంగా 42% బీసీ రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ నేత శంభీపూర్ కృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ:
“రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలి. బీసీల హక్కులను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలి అని డిమాండ్ చేశారు.”
ఈ ధర్నా కార్యక్రమం బీసీల రాజకీయం, సామాజిక హక్కులపై పునరాలోచనకు దారి తీశిందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.
- తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ (BC Welfare Department Telangana) : https://tsbcwd.cgg.gov.in
- తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (Election Commission Telangana) : https://ceotelangana.nic.in