Bank Strike January 27: దేశవ్యాప్తంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల (PSBs) సేవలకు జనవరి 27న అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఐదు రోజుల పని వారం అమలు చేయాలి అనే ప్రధాన డిమాండ్‌తో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది.

జనవరి 25 (ఆదివారం), జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) ఇప్పటికే బ్యాంక్ సెలవులు కావడంతో, మంగళవారం సమ్మెతో కలిపి వరుసగా మూడు రోజులు బ్యాంక్ శాఖల కార్యకలాపాలపై ప్రభావం పడనుంది.
Bank Strike January 27 సమ్మెకు కారణం ఇదే
జనవరి 23న చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన చర్చల్లో బ్యాంక్ యూనియన్ల డిమాండ్‌పై స్పష్టత రాకపోవడంతో సమ్మె నిర్ణయం తీసుకున్నట్లు UFBU తెలిపింది. ఈ ఫోరమ్‌లో బ్యాంక్ ఉద్యోగులు, అధికారులను ప్రాతినిధ్యం వహించే తొమ్మిది యూనియన్లు ఉన్నాయి.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం మాట్లాడుతూ, చర్చలు జరిగినా మా డిమాండ్‌పై ఎలాంటి హామీ రాలేదు. అందుకే సమ్మెకు వెళ్ళాల్సి వచ్చింది” అని తెలిపారు.
ఐదు రోజుల పని వారం డిమాండ్
ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) ప్రధాన కార్యదర్శి రూపమ్ రాయ్ మాట్లాడుతూ,
మార్చి 2024లో జరిగిన వేతన సవరణ ఒప్పందంలో అన్ని శనివారాలు సెలవులుగా ప్రకటించేందుకు అంగీకారం కుదిరిందని చెప్పారు.
“ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. మేము సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ అదనంగా 40 నిమిషాలు పనిచేయడానికి కూడా అంగీకరించాం” అని పేర్కొన్నారు.
ఏ సేవలకు అంతరాయం?
- సమ్మె కారణంగా
- నగదు జమ / ఉపసంహరణ
- చెక్ క్లియరెన్స్
బ్రాంచ్ స్థాయి పరిపాలనా పనులు
వంటి సేవలు ప్రభావితమయ్యే అవకాశముంది.
ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇందులో ఉన్నాయి.
డిజిటల్ సేవలు కొనసాగింపు
UPI, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు కొనసాగుతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏటీఎం నగదు లభ్యతలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రైవేట్ బ్యాంకులు అయిన HDFC, ICICI, Axis Bank లపై ఈ సమ్మె ప్రభావం ఉండకపోవచ్చని సమాచారం.
ఎస్‌బీఐ ప్రకటన
ఎస్‌బీఐ స్టాక్ ఎక్స్చేంజ్‌కు చేసిన ప్రకటనలో,
“బ్యాంక్ సాధారణ కార్యకలాపాల కోసం ఏర్పాట్లు చేసినప్పటికీ, సమ్మె కారణంగా పని ప్రభావితమయ్యే అవకాశం ఉంది” అని పేర్కొంది.
ప్రస్తుత విధానం ఇదే
ప్రస్తుతం బ్యాంకులు
మొదటి , మూడో , ఐదో శనివారాల్లో
పని చేస్తుండగా, యూనియన్లు అన్ని శనివారాలు సెలవులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
