Telanganapatrika (July 30): బండి సంజయ్ , కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ మోడీ కానుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పుట్టినరోజు సందర్భంగా సైకిళ్ల పంపణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

విద్యలో వెనుకపడకూడదు – బండి సంజయ్ భరోసా…
కార్యక్రమంలో భాగంగానే వావిలాల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు ‘మోడీ కానుక’గా సైకిలను పంపిణీ చేసిన జమ్మికుంట మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు, మండల ప్రధాన కార్యదర్శి పుల్లూరి ఈశ్వర్ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పూర్తితో, వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న నవ భారతంలో విద్యార్థుల భవిష్యత్తుకు దూరం అనేది విద్యకు అడ్డుకాకూడదని, పాఠశాలల్లో సదుద్దేశంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో 20వేల సైకిళ్ల పంపిణీకి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ శ్రీకారం చుట్టారని తెలిపారు.
అలాగే ఇతర తరగతి విద్యార్థులకు ‘మోదీ కిట్స్’ పేరుతో బ్యాగ్, వాటర్ బాటిల్, పుస్తకాలు అందివ్వాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు. పేదరికం వల్ల చదువుకు దూరమయ్యే వేల మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ఈ ప్రయత్నాలు భరోసానిస్తాయని నాయకులు ఆశించారు. ఈ కార్యక్రమంలో వీరగోని రాజన్న, మేడిపల్లి సమ్మయ్య ,కొండ హరీష్, రాగల మహేష్, బాసాని సత్యం, తుడి గణేష్, రుద్రవరం శివానంద చారి తదితరులు పాల్గొన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu