Telanganapatrika (జూలై 11): Bandi Sanjay Birthday Celebrations in Vemulawada, కేంద్రమంత్రి బండి సంజయ్ గారి జన్మదినం సందర్భంగా వేములవాడ బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాజన్న గుడిలో కోడెల మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగింది మరియు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు రాపేల్లి శ్రీధర్ మాట్లాడుతూ బండి సంజయ్ గారు మరింత ఉన్నతమైన పదవులను అధిరోహించాలని ఆయురారోగ్యాలతోటి ప్రజలకు సేవలు చేయాలని కోరుకున్నారు ప్రతాప రామకృష్ణ గారు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మ సేవకులు కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఎదిగిన బండి సంజయ్ గారు ఆరోగ్యంగా ఉండాలని రాష్ట్ర ప్రజలకు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకున్నారు వారు కష్టపడ్డ తీరును గుర్తుంచుకొని వారి పార్లమెంట్ పరిధిలోని బీద విద్యార్థులందరికీ సైకిళ్ళు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు ఇందులో భాగంగా వేములవాడ నియోజకవర్గానికి త్వరలో సైకిళ్ల పంపిణీ ఉంటుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బిజెపి కార్యకర్తలు నాయకులు పట్టణ కమిటీ సభ్యులు పాల్గొన్నా.
Bandi Sanjay Birthday Celebrations in Vemulawada:


మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే — తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఇతర ప్రాంతాలు — www.telanganapatrika.in లో రాష్ట్రాలు, రాజకీయాలు, ఉద్యోగాలు, విద్య, మరియు పబ్లిక్ ఇంటరెస్ట్ కు సంబంధించిన విశ్లేషణాత్మక వార్తలు అందుబాటులో ఉంటాయి.