Advertisement

Babu Jagjivan Ram Statue బాబు జగ్జీవన్ రామ్,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement


Babu Jagjivan Ram statue: ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ల జయంతి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు.ఏప్రిల్ 5 న బాబు జగ్జీవన్ రామ్, ఏప్రిల్ 14 న Babu Jagjivan Ram statue జయంతి ఉత్సవాల నిర్వహణ విషయమై బుధవారం ఆమె ఉదయాదిత్య భవన్ లో వివిధ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ సంఘాల నాయకుల అభిప్రాయాలను పరిగణలో తీసుకోని విజయవంతం చేసేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అందువల్ల సంఘాల ప్రతినిధులు సమన్వయంతో ఉత్సవాల విజయవంతానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రంగం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.ముందుగా గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్,డాక్టర్ బి. ఆర్ అంబెడ్కర్ జయంతిల సందర్బంగా పారిశుధ్యం,డెకరేషన్ ,టెంట్లు,ఇతర ఏర్పాట్లు చేస్తామని తెలిపారు

Advertisement


అనంతరం ఏర్పాట్లపై వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిల సందర్భంగా రిజిస్టర్డ్ సంఘం నుండి ఒకరికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, డివిజన్ వారిగా ఉత్సవాలు నిర్వహించాలని, మర్రి గూడ జంక్షన్ కు అంబేద్కర్ జంక్షన్ గా నామకరణం చేయాలని, అంబేద్కర్ విగ్రహానికి బాబు జగ్జీవన్ విగ్రహానికి దండలు వేసేందుకు ఇబ్బంది ఉందని, ఆ సమస్య తొలగించాలని, అంబేద్కర్ కల్చరల్ భవనాన్ని బాగు చేయాలని,ఉత్సవాలకు హాజరయ్యే విద్యార్థులకు ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలని, టెంట్ వెయ్యాలని, రోడ్డు విస్తరణ సందర్భంగా తొలగించిన జగ్జీవన్ రామ్, అంబేద్కర్ విగ్రహాలను పునరుద్ధరించాలని, జయంతిలతోపాటు,వర్ధంతిలను అధికారికంగా నిర్వహించాలని కోరారు.అదనపు ఎస్ పి రమేష్, జడ్పి సి ఈ ఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు, డి సి ఓ పత్యా నాయక్, తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Read More.

Advertisement
Advertisement

About Ganeshghani

GaneshGhani is a Editor with 1.5 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.

View all posts by Ganeshghani →