Telanganapatrika (July 10): MRO Land Scam , అశ్వారావుపేట నియోజకవర్గంలో గతంలో పనిచేసిన తహసిల్దార్ వ్యవహారం ఇప్పుడు ప్రజల నోరుపై పెద్ద చర్చగా మారింది. సర్కారు భూములపై అనుమతులు ఇచ్చే విషయంలో నిబంధనలు పక్కనపెట్టి, ఏజెంట్ల ఇళ్ల నుంచే తన కార్యచరణను నడిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

MRO Land Scam సర్వే నెంబర్ల మార్పులు — వారి స్టైల్ వేరు
1960 నుంచి 2018 వరకూ ఒక లెక్కగా ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్లు, 2018 తరువాత నూతన “A to W” బై నెంబర్లుగా మారినట్టు తెలుస్తోంది. ఈ మార్పుల ద్వారా భూ హక్కులు బడాబాబులకు అనుకూలంగా మార్చబడ్డాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
నకిలీ పట్టా పాస్ పుస్తకాలు:
అసలు యజమానుల పేర్లను తొలగించి, ఇతరుల పేర్లను నమోదు చేయడం , ఒకరి సర్వే నంబరును మరొకరికి కేటాయించడం , లక్షల రూపాయల ముడుపులతో నకిలీ దస్తావేజుల మంజూరు ..
కార్యాలయం కాదు — ఏజెంట్ల ఇళ్లు:
తాను నియమించిన ఏజెంట్ల ఇళ్ల నుంచే అన్ని కార్యాలు జరిగేవి. లంచం ఇవ్వగలిగినవారికి మాత్రమే సౌకర్యాలు, హక్కులు లభించాయి. వందల మంది నిజమైన భూ యజమానులు నేటికీ న్యాయస్థానాలు తిరుగుతూనే ఉన్నారు.
ప్రజల డిమాండ్:
ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపి, బాధ్యులను శిక్షించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సర్వే నెంబర్ల గందరగోళాన్ని తొలగించి, ఒరిజినల్ భూ యజమానులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu