AP Polytechnic Results 2025 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన విద్యార్థులకు గుడ్‌న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన AP POLYCET 2025 పరీక్ష ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ప్రకటించారు.

పరీక్ష వివరాలు:
ఏప్రిల్ 30న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షలో మొత్తం 1,39,840 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 1,33,358 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో ఉత్తీర్ణత శాతం 95.36గా నమోదైంది.
Top Rankers: 120కి 120 మార్కులు సాధించిన 19 మంది
ఈసారి AP Polytechnic Results 2025 ప్రకారం 19 మంది విద్యార్థులు 120కి 120 మార్కులు సాధించి ఒక రికార్డును నమోదు చేశారు. వారి కృషిని మంత్రి లోకేశ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ టాపర్స్ విజయానికి సంబంధించి మంత్రి “X”లో మెసేజ్ కూడా పోస్ట్ చేశారు.
జిల్లా వారీ ఉత్తీర్ణత శాతాలు
అల్లూరి సీతారామరాజు జిల్లా అత్యధికంగా 98.66% ఉత్తీర్ణత నమోదు చేసింది.
ఇతర జిల్లాల్లో సైతం AP Polytechnic Results 2025 ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనిపించింది.
రిజల్ట్ లింక్ మరియు ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ విధానం:
విద్యార్థులు తమ AP POLYCET Rank Card 2025 ను అధికారిక వెబ్‌సైట్ అయిన polycetap.nic.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్ కోసం హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ అవసరం. అధికారిక లింక్‌తో పాటు మానబడి వెబ్‌సైట్లలో కూడా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి.
మొబైల్ యాప్‌లో కూడా ఫలితాలు
విద్యార్థులు UMANG యాప్, DigiLocker ద్వారా కూడా AP Polytechnic Results 2025 ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
Direct Links
Official Site – polycetap.nic.in
Manabadi AP POLYCET 2025
Read More: CBSE 12th class Results 2025 విడుదల @cbseresults.nic.in: హాల్ టికెట్ నంబర్‌తో ఫలితాలు చెక్ చేయండి!
Comments are closed.