Kavitha Comments, ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియా ముందుకు రాగానే సంచలనం నెలకొంటుంది. ఆమె ఎప్పుడు, ఎవరిపై ఏం ఆరోపణలు చేస్తారో అనే భయం నాయకుల్లో నెలకొంది.

తన పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా… ఆమె పదులతో ఉత్తేజపరుస్తారు. ఆమె మాటల్లోని నిజాన్ని పక్కన పెడితే… కవిత చేసే Comments రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా… కవిత మరోసారి మీడియా ముందుకు వచ్చారు. సందర్భంగా మాట్లాడుతూ…
బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా, ఎమ్మెల్యే హరీశ్ రావు సోషల్ మీడియా, సంతోష్ రావు రహస్య మీడియా తనపై దాడి చేస్తున్నాయని కవిత ఆరోపించారు. అందరూ తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పారో తనకు తెలియదని, కానీ 42 శాతం బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోకపోతే, ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్లపై దాడి చేస్తానని ఆమె హెచ్చరించారు.
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్సీ పదవి నుండి రాజీనామా చేశానని, ఛైర్మన్‌కు రాజీనామా స్వీకరించమని కోరానని చెప్పారు. ఎందుకు రాజీనామాను ఆలస్యం చేస్తున్నారో తనకు తెలియదని పేర్కొన్నారు.
