Telanganapatrika (July 12): ACB , ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తన బృందం విస్తృతస్థాయి దాడులు నిర్వహిస్తోంది

జిల్లాలో ఇటీవల కాలంలో పలు కార్యాలయాల్లో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో బాధితుల నుంచి ఫిర్యాదు వచ్చిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పడుతున్నారు.
అవినీతి వలలో AE – ఏసీబీ ACB రెడ్ హ్యాండెడ్ దాడి
తాజాగాఓ లంచగొండి అధికారి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం పట్టుకున్నారు.కాల్వ శ్రీరాంపూర్ పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ రాజు నుండి సీసీ రోడ్డు బిల్లు మంజూరు కోసం రూ.90 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం.. బాధితుడి నుండి ఏఈ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు
Read More: Read Today’s E-paper News in Telugu