Anil Family Justice: ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ పరామర్శ.

Telanganapatrika (July 17) : Anil Family Justice , మరెల్లి అనిల్ కుటుంబానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ న్యాయం కల్పిస్తారనే హామీ, పరిష్కార చర్యలు.

Join WhatsApp Group Join Now

Anil Family Justice - SC ST Commission Chairman Assures Justice to Anil’s Family

Anil Family Justice

  • కొల్చారం: దారుణ హ*త్యకు గురైన కాంగ్రెస్ యువనాయకుడు మరెల్లి అనిల్ కుటుంబ సభ్యులను గురువారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ భక్కి వెంకటయ్య పరామర్శించారు. అనిల్ కుటుంబానికి న్యాయం చేస్తామని కమిషన్ తెలిపారు. అతని తండ్రి అనంతయ్య, తల్లి ఏసమ్మ, మృతుని భార్య శిరీష, సోదరుడు నవీన్ లతో మాట్లాడి సంఘటన వివరాలు ಅడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, మెదక్ డిఎస్పీలతో మాట్లాడారు. అనిల్ ను చంపిన వ్యక్తులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, కొల్చారం ఎస్సై మొహమ్మద్ గౌస్, డిబిఎస్ జిల్లా అధ్యక్షుడు శంకర్, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పుర్రె ప్రభాకర్, మాజీ ఉప సర్పంచ్ సుమలత బాబు, మండలంలోని వివిధ గ్రామాల చిన్న దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.

ప్రత్యేక వార్తలు, తాజా అప్‌డేట్స్ కోసం తెలంగాణ పత్రిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. పూర్తి సమాచారం అక్కడ అందుబాటులో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *