తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో శాంతను నారాయణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం, గ్లోబల్ కంపెనీలను ఆహ్వానించడం వంటి అంశాలపై చర్చించారు.

Adobe CEO meets Revanth Reddy, ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ Adobe CEO అయిన శాంతను నారాయణ్, “Telangana Rising-2047 Vision Board” సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం, ఉద్యోగ అవకాశాలు, స్కిల్లింగ్ మరియు రీ-స్కిల్లింగ్ వంటి కీలక అంశాలపై ఇద్దరూ అభిప్రాయాలు పంచుకున్నారు.
రాష్ట్రాన్ని మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అంతేకాకుండా, ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంలో మరింత దూకుడు చూపాలని అధికారులను కోరారు.
AI విప్లవం ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావం గురించి కూడా ముఖ్యమంత్రి అడోబ్ CEOని అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో AI వినియోగాన్ని సమర్థవంతంగా ఎలా ఉపయోగించుకోవాలో కూడా చర్చించారు.
తెలంగాణ అభివృద్ధికి అడోబ్ సహకారం మరింత అవసరమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
