తెలంగాణ పత్రిక (APR.29) , విప్ ఆది శ్రీనివాస్ వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, తూకం వేసిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విప్ ఆది శ్రీనివాస్ పరిశీలన:
నిజామాబాద్ గ్రామంలో, కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పరిశీలించిన ఆది శ్రీనివాస్, కేంద్రం వద్ద హమాలీలను స్వయంగా అడిగి పలు అంశాలు తెలుసుకున్నారు. హమాలీలకు వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని తాగునీటి సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలంటూ సూచించారు.
నీటి రుచిని స్వయంగా పరీక్షించిన విప్ ఆది శ్రీనివాస్:

- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ , కలెక్టర్‌తో కలిసి చేతి పంపులోని నీటిని స్వయంగా తాగి నీటి నాణ్యతను రుచి చూశారు. ఈ చర్యతో ప్రజలకు ప్రభుత్వం తాగునీటిపై ఎంత దృష్టి పెట్టుతోందో మరోసారి స్పష్టమైంది.
- మర్తన్నపేట, గొల్లపల్లి గ్రామాల్లోని తాగునీటి బోర్లను పరిశీలించిన కలెక్టర్ మరియు విప్, మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా ఎలా జరుగుతుందన్న విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నారు.
- గ్రామస్తులు తమ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి ఉందని చెప్పారు. దానికి స్పందించిన ప్రభుత్వ విప్, సంబంధిత అధికారులను ఆదేశించి కొత్తగా మోటర్లు మంజూరు చేయించారు. (మర్దనపేట – 2, గొల్లపల్లి – 1, మరిమడ్ల – 1 మోటర్లు)
Read more: Read Today’s E-paper News in Telugu