Telanganapatrika (July 25) :Aadhar Update for Inter Students, తెలంగాణ ఇంటర్ బోర్డు తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు, రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మరియు అనుబంధ జూనియర్ కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఆధార్ అప్డేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.

Aadhar Update for Inter Students.
ఈ ప్రక్రియలో భాగంగా ఆధార్ అప్డేషన్ ఏజెన్సీలతో ఒప్పందం చేసుకుని, కళాశాలలకే అధికారులను పంపి విద్యార్థులకు నేరుగా ఆధార్ అప్డేషన్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.
బయోమెట్రిక్ అప్డేషన్ ప్రథమంగా చేస్తున్న 15 నుండి 17 సంవత్సరాల విద్యార్థులకు ఇది పూర్తిగా ఉచితం. మిగిలిన వారికి మాత్రం నామమాత్రపు చార్జీలను మాత్రమే వసూలు చేయనున్నారు.
విద్యార్థులు పదోతరగతి మెమో ఆధారంగా తమ ఆధార్ డేటాలో సరిచూసుకోవచ్చు. తద్వారా విద్యాసంబంధిత UDISE డేటా సమగ్రంగా నమోదు చేయడం మరింత సులభమవుతుందని అధికారులు పేర్కొన్నారు.
Read More: Private School Fees Structure 2025 – ఏపీలో కొత్త ఫీజు విధానం
One Comment on “Aadhar Update for Inter Students: ఇంటర్ విద్యార్థులకు ఆధార్ అప్డేషన్ ప్రక్రియ ప్రారంభం 2025.”