Vizag AI Hub: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖను భారతదేశంలోనే అతిపెద్ద AI మరియు క్లౌడ్ టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు టాప్ గేర్‌లో పనిచేస్తోంది. ముఖ్యంగా గూగుల్, TCS, Cognizant వంటి గ్లోబల్ కంపెనీలు భారీ పెట్టుబడులతో ఎంట్రీ ఇవ్వడంతో, విశాఖ IT మ్యాప్‌లో వేగంగా ఎదుగుతోంది.

గూగుల్ AI డేటా సెంటర్ 15 బిలియన్ డాలర్ల భారీ ఇన్వెస్ట్మెంట్
2025 అక్టోబరులో ప్రభుత్వం గూగుల్‌కు చెందిన Raiden Infotech ఆధ్వర్యంలో ఒక భారీ AI ఆధారిత డేటా సెంటర్ ప్రాజెక్టును ఆమోదించింది.
Vizag AI Hub ఈ ప్రాజెక్ట్‌లో
- USD 15 బిలియన్ (దాదాపు ₹1.25 లక్షల కోట్లు) పెట్టుబడి
- 1 గిగావాట్ డేటా సెంటర్ సామర్థ్యం
- అనకాపల్లి & విశాఖ జిల్లాల్లో 400 ఎకరాల భూమి కేటాయింపు
ఇది గూగుల్ యొక్క మొదటి AI హబ్ ఇండియాలో మరియు అమెరికా వెలుపల అతిపెద్ద క్యాంపస్‌లలో ఒకటి కానుంది. APIIC ఇప్పటికే అనువైన భూములను గుర్తించి కంపెనీకి అప్పగించే ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళుతోంది. సపోర్ట్ ఫెసిలిటీలు కోసం అదనంగా 480 ఎకరాలు ప్రభుత్వం అదనంగా 480 ఎకరాలను కూడా కేటాయించింది. ఈ ప్రాంతాల్లో:
- కేబుల్ ల్యాండింగ్ స్టేషన్
- పవర్ సిస్టమ్స్
- ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్
మొత్తం ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత శాఖలు నిర్దిష్ట టైమ్‌లైన్‌లో భూముల సర్వే, హ్యాండోవర్ పనులను పూర్తి చేయాలి. డేటా సెంటర్ పాలసీ 2024–29 కింద ₹22,000 కోట్ల ఇన్సెంటివ్స్
ఈ పాలసీ ద్వారా:
- క్లౌడ్
- నెట్‌వర్కింగ్
- AI సర్వీసుల
వృద్ధిని ప్రోత్సహించేందుకు భారీ ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.
Vizag AI Hub TCS – విశాఖలో త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం
TCS ఇప్పటికే 21.76 ఎకరాల క్యాంపస్‌ను నిర్మించింది. రెండు ఆఫీస్ బ్లాక్స్‌లో:
1,500 ఉద్యోగులకు సీటింగ్ సామర్థ్యం రాబోయే రెండు వారాలలో ఆపరేషన్స్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Cognizant – 22 ఎకరాలు, రూ.1,583 కోట్ల పెట్టుబడి
కమ్మడి–మధురవాడ బెల్ట్‌లో Cognizant కోసం ప్రభుత్వం 22 ఎకరాలు కేటాయించింది.
ఒక్కో ఎకరానికి ధర — 99 పైసలు మాత్రమే భూమి సిద్ధంగా ఉంది త్వరలో భూమిపూజ జరిగే అవకాశం
ఈ ప్రాజెక్ట్ ద్వారా:
₹1,583 కోట్లు పెట్టుబడి , 800 పైగా డైరెక్ట్ జాబ్స్హౌ ,సింగ్, ట్రాన్స్‌పోర్ట్ వంటి సర్వీసులకు భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది.
విశాఖ భారతదేశంలో కొత్త AI రాజధాని వైపు
గూగుల్, TCS, Cognizant—all in one place! ఈ మూడు దిగ్గజ కంపెనీల రాబోయే పెట్టుబడులు విశాఖను
దక్షిణాసియాలో అతిపెద్ద AI హబ్‌గా , భారత డేటా ఇన్‌ఫ్రా రాజధానిగా మార్చేలా కనిపిస్తున్నాయి.
నాయుడు ప్రభుత్వం అత్యంత వేగంగా భూ కేటాయింపులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ పనులు చేస్తున్నందున, వచ్చే సంవత్సరాల్లో విశాఖ IT రంగంలో అగ్రస్థానంలో నిలవడం ఖాయం.
Read More: Read Today’s E-paper News in Telugu
