Lok Bhavan Telangana: తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్ పేరును ప్రభుత్వం అధికారికంగా మార్చింది. ఇకపై ఇది ‘లోక్ భవన్, తెలంగాణ’గా పిలవబడనుంది. గత ఏడాది గవర్నర్ల సమావేశంలో వచ్చిన సిఫార్సులు మరియు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Lok Bhavan Telangana మంగళవారం విడుదల చేసిన లోక్ భవన్ అధికారిక ప్రకటనలో –
“తెలంగాణ గవర్నర్ నివాసం అయిన రాజ్ భవన్ పేరును మార్చి, ప్రజాస్వామ్య బలం, పారదర్శకత, ప్రజలతో అనుసంధానం చాటి చెప్పే విధంగా ‘లోక్ భవన్, తెలంగాణ’గా నిర్ణయించాం” అని పేర్కొన్నారు. ఈ కొత్త పేరు తక్షణమే అన్ని అధికారిక రికార్డులు, దస్త్రాలు, కమ్యూనికేషన్లలో అమలులోకి వస్తుంది.
ప్రభుత్వం ప్రకారం, ఈ మార్పు వికసిత్ భారత్ వైపు ప్రజాస్వామ్య భావాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా తీసుకున్న నిర్ణయం.
తెలంగాణలో ఇది ఒక ముఖ్యమైన పరిపాలనా మార్పుగా కనిపిస్తోంది, ఎందుకంటే రాజ్‌భవన్ అనే సంప్రదాయపదాన్ని తొలిసారి మార్చి ‘లోక్’ అనే ప్రజలతో అనుసంధానం కలిగిన పదాన్ని అధికారికంగా ఉపయోగిస్తున్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
