KNRUHS PG Exam Irregularities: తెలంగాణలోని కాలోజి నారాయణరావు ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం (KNRUHS) మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ఈసారి PG మెడికోస్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా 1–2% మాత్రమే ఉండే ఫెయిల్యూర్ రేటు, ఈ సారి అభూతపూర్వంగా 11% చేరడంతో విద్యార్థులు, కాలేజీలు, ఆరోగ్య శాఖ వరకు కలకలం రేగింది.

PG విద్యార్థుల ఆరోపణలు — మూల్యాంకనలో పెద్దపాటి తప్పిదాలు
సర్కారు, ప్రైవేట్ మెడికల్ కాలేజీల PG విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం:
MC/MS పరీక్షలు అక్టోబర్ 7 నుండి 30 వరకు జరిగాయి. నవంబర్ 4న ఫలితాలు ప్రకటించారు , తక్కువ సమయంలో ఫలితాలు విడుదల కావడంతో, స్క్రిప్టులు బహుళ పరీక్షకుల మూల్యాంకనకు వెళ్లలేదనే అనుమానం విద్యార్థుల్లో వ్యక్తమవుతోంది. డాక్టర్ వెంకటేష్ కుమార్ మాట్లాడుతూ, మూల్యాంకన ప్రక్రియలో తీవ్రమైన పొరపాట్లు జరిగి ఉండొచ్చని, మార్కుల్లో భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
KNRUHS PG Exam Irregularities సాఫ్ట్‌వేర్ కారణంగానే తప్పిదాలా?
PG డాక్టర్లు ముఖ్యంగా ఆరోగ్య విశ్వవిద్యాలయం టెక్నికల్ విభాగంపై విమర్శలు గుప్పించారు.
వారి ఆరోపణలు:
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మూల్యాంకన సాఫ్ట్‌వేర్ మార్చారు. మైక్రోబయాలజీ, కమ్యూనిటీ మెడిసిన్ వంటి విభాగాల్లో భారీ ఫెయిల్యూర్ రేటుకి ఇదే ప్రధాన కారణమని చెబుతున్నారు.
KNRUHS PG Exam Irregularities VC నందకుమార్ రెడ్డి రాజీనామా — తిరిగి బాధ్యతలు
వివాదాలు తీవ్రంగా పెరగడంతో:
శుక్రవారం వీసీ డాక్టర్ నందకుమార్ రెడ్డి రాజీనామా చేశారు. కానీ, ఒకరోజు తర్వాత తిరిగి బాధ్యతలు చేపట్టారు
“కొత్త వీసీ వచ్చే వరకు తాత్కాలికంగా కొనసాగాలని చెప్పారని” మీడియాకు తెలిపారు
ఇదిలా ఉండగా, సీనియర్ డాక్టర్లు మాత్రం వీసీపీపై ఇప్పటికే పలు శాఖల నిర్వహణలో లోపాలున్నాయని ఆరోపిస్తున్నారు.
విద్యార్థుల అరుపు — విచారణే ఒక్క మార్గం
విద్యార్థులు ఫలితాలు వచ్చినరోజు నుంచే ఆరోగ్య శాఖా కార్యదర్శి వీసీ ఆరోగ్య మంత్రి ఇతర అధికారులను వరుసగా కలిశారు.
“ఎవరూ చర్య తీసుకోకపోవడంతో, ఇప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని విజిలెన్స్ విచారణ ఆదేశించాలని” డిమాండ్ చేస్తున్నారు.
తమపై అన్యాయం జరగకుండా:
గ్రేస్ మార్కులు లేదా రీ-ఎవాల్యుయేషన్ అవకాశం ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. ఆసుపత్రుల్లో ఉద్యోగుల ఆగ్రహం
VC రాజీనామా వార్త వెలువడగానే, KNRUHS క్యాంపస్‌లో ఉద్యోగులు:
పటాకులు పేల్చి సంబరాలు చేసుకున్నట్లు సీనియర్ డాక్టర్లు వెల్లడించారు. ఇది సమస్య ఎంత తీవ్రమో నొక్కి చెబుతోంది.
Read More: Read Today’s E-paper News in Telugu
