iBomma Ravi Piracy Case: సినిమా పైరసీ నెట్‌వర్క్ ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవి జూన్‌లోనే పోలీసులకు చవ్వరిస్తూ “నా వెంట పడకండి… లేకపోతే నేనే మీ వెంటపడతా” అని చెప్పిన విషయం తెలిసిందే. అరెస్ట్‌కు ముందు నుంచే తనకు ప్రమాదం ఉందని గ్రహించిన రవి, పట్టుబడే ఒకరోజు ముందు ఫ్రాన్స్ నుంచి నెదర్లాండ్స్‌కు వెళ్లిపోయాడు. అక్కడే ప్రధాన సర్వర్‌తో పాటు ఇతర వెబ్‌సైట్లలోని డేటాను పూర్తిగా నాశనం చేశాడు. అదనంగా, తన వద్ద దొరికిన హార్డ్‌డిస్క్‌లో కొద్దిపాటి పైరసీ ఫైళ్లను ఉంచి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు.

iBomma Ravi Piracy Case టెక్నికల్ ఎక్స్‌పర్ట్ మరియు వెబ్ డిజైనర్ అయిన రవి, RGIA షంషాబాద్‌లో గానీ, కూకట్‌పల్లి ఇంట్లో గానీ తాను అరెస్ట్ అయ్యే అవకాశముందని ముందే అంచనా వేసుకున్నాడు. అందుకే ముందుగానే పక్కా ప్లాన్ వేసుకుని, సర్వర్లను క్లియర్ చేయడం, డబ్బును పలు ఖాతాల ద్వారా మళ్లించడం, లక్షల రూపాయలను దారిమళ్లించడం వంటి చర్యలు తీసుకున్నాడు.
సైబర్‌క్రైం పోలీసులు హ్యాకర్లను అద్దెకు తీసుకుని పైరసీ వెబ్‌సైట్లు బ్లాక్ చేయించే ప్రయత్నం చేసినా, రవి వేసిన టెక్నికల్ సెట్టింగ్స్ కారణంగా అవన్నీ విఫలమయ్యాయి. ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ రవి ఏ విషయానికైనా సహకరించలేదు. iBommaని బ్లాక్ చేయడానికి సహాయం చేస్తున్నట్టు నటించినా, అసలు వెబ్‌సైట్‌కు అనేక లేయర్‌ల్లో మిర్రర్‌సైట్లు కనెక్ట్ చేసి పెట్టడంతో పోలీసుల ప్రయత్నాలు ఫలించలేదు.
iBomma Ravi Piracy Case
ఎన్ని ప్రశ్నలు అడిగినా రవి పాస్‌వర్డ్స్ వెల్లడించలేదు. “నాకు గుర్తులేదు” అనే సమాధానం మాత్రమే ఇచ్చాడు. దాంతో, పోలీసు టెక్నికల్ టీములు అతని హార్డ్‌డిస్క్ నుంచి దొరికిన డేటా ఆధారంగా అతని బ్యాంక్ ఖాతాల వివరాలతో పలు బ్యాంకులకు మెయిల్స్ పంపగా, కొన్ని కీలక స్పందనలు వచ్చినట్టు సమాచారం.
కస్టడీ మొత్తం ఐదు రోజులలో రవి ఒకరే అన్నట్టుగానే ప్రవర్తించాడు. “నాకెవరూ సహాయం చేయలేదు, నేను అన్నీ ఒంటరిగా చేశా. పైరసీ సినిమాలు అప్‌లోడ్ చేయడం కూడా యూట్యూబ్, ఇంటర్నెట్ చూసుకుంటూ నేర్చుకున్నా” అని నగర పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సమక్షంలో కూడా అదే సమాధానం చెప్పాడు.
తన వ్యక్తిగత ప్రయాణాలు, కుటుంబం గురించి వివరాలు చెప్పిన రవి, PMLA కేసులు, సహచరులు, టెక్నికల్ నెట్‌వర్క్ విషయంలో మాత్రం నోరు విప్పలేదు. స్పెయిన్–ఫ్రాన్స్‌ల సముద్రతీరానికి దగ్గరగా ఉండే కాంటాబ్రియాలో ఉంటూ, ప్రతి రెండు వారాలకోసారి స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయ్లాండ్, కువైట్, దుబాయ్ వంటి దేశాలకు ప్రయాణించినట్టు అతని పాస్‌పోర్ట్ వెల్లడించింది.
లగ్జరీ జీవితం గడిపిన రవి, లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ సెయింట్ కిట్స్ & నీవిస్ పౌరసత్వం పొందాడు. విదేశీ సర్వర్లపై ఆధారపడి పైరసీ నెట్‌వర్క్ నడిపాడు. పోలీసులు ఇప్పటికే రూ. 3.50 కోట్లు ఫ్రీజ్ చేసారు. అలాగే, హైదరాబాద్ మరియు విశాఖపట్నం ప్రాంతాల్లో అతనికి విలువైన ఆస్తులు ఉన్నట్లు బయటపడింది.
పీఎంఎల్ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఇప్పటి వరకు రవి అక్రమ ఆదాయం రూ. 20 కోట్లను గుర్తించింది. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేస్తూ మరిన్ని ఆధారాలు దొరకవచ్చని ఆశిస్తున్నారు. ఈ నెట్‌వర్క్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్, డేటా దొంగిలింపు వంటి ప్రమాదకర వ్యవహారాలు ఉన్న కారణంగా, సినిమా పరిశ్రమకు పెద్ద ముప్పుగా ఈ వ్యవస్థ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.
ఐదు రోజుల కస్టడీలో రవి ఒంటరిగా iBomma Ravi Piracy Case మరియు దాని మల్టీ-లేయర్డ్ మిర్రర్‌సైట్లు అభివృద్ధి చేసినట్టు చెప్పాడు.
గత అయిదేళ్లలో రవి రూ. 100 కోట్లకు పైగా సంపాదించాడు; అందులో రూ. 30 కోట్ల లావాదేవీలు స్థానిక, అంతర్జాతీయంగా గుర్తించారు.
టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పైరసీ సినిమాలు కొనుగోలు చేసి, డాలర్లలో చెల్లింపులు చేశాడు.
యూజర్లకు కంట్రోల్డ్ యాక్సెస్ ఇచ్చి, ఒక్క క్లిక్‌కు 15 ప్రకటనలు వచ్చే విధంగా అడ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేశాడు; బెట్టింగ్ యాప్స్, మ్యాట్రిమోనీ ఎడ్స్, గేమింగ్ ఎడ్స్‌ను ప్రమోట్ చేశాడు.
వీక్షణలను 50 లక్షలకు పైగా చూపించి, USDT ద్వారా డబ్బు ఇండియా అకౌంట్లకు రప్పించుకున్నాడు.
Read More: Read Today’s E-paper News in Telugu
