Advertisement

Rama Navami 2025: వేల భక్తుల జనసంద్రంలో శ్రీ సీతారాముల కళ్యాణం చూసేవారికి కమనీయం

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డి.

Rama Navami 2025

Rama Navami 2025: తెలంగాణ పత్రిక, మండల కేంద్రమైన కౌడిపల్లి లో శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని శ్రీ అభయ రామాలయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు శ్రీ కోలచాల రాజేశ్వర శర్మ, సృజన్ శర్మ, సుమన్ శర్మ, ఫణీంద్ర శర్మ, చేతుల మీదుగా వేదమంత్రాలతో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కళ్యాణానికి మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, దంపతులు చిలుముల వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహారెడ్డి, దంపతులు పట్టు వస్త్రాలు పూలు, పళ్ళు, పూజా సామాగ్రి, సమర్పించారు. స్వామివారి కల్యాణానికి గ్రామానికి చెందిన సుమారు 15 జంటలకు పైగా కళ్యాణం పై కూర్చున్నారు. ఇలా ప్రతి ఏటా నిర్వహించే సీతారాముల కళ్యాణం లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం, గ్రామానికి చెందిన పోల జనార్దన్, దంపతులు పుస్తె మెట్టెలు, వడుక జంజాలు, బాషింగాలు, సమర్పించారు. శ్రీ కరి జువెలర్స్ తరపున అవుసుల నాగరాజు చారి, కుటుంబ సభ్యులు స్వామివారికి ముత్యాల దండలు ముత్యాల తలంబ్రాలు అందించారు.

Advertisement
Join WhatsApp Group Join Now

Advertisement

ఇలా చాలావరకు గ్రామ పెద్దలు కులమత బేధం లేకుండా స్వామివారికి సేవ చేయాలనే దృడ సంకల్పంతో ఎవరికి తోచిన విధంగా వారు ప్రతి ఒక్క కార్యక్రమంలో చేఅందించి కళ్యాణానికి తోడ్పడ్డారు. అనంతరం ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, చిలుముల సుహాసిని రెడ్డి, హాజరై శ్రీ సీతారాములను దర్శించుకుని, ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెల్మకన్య గ్రామంలో నిర్వహించిన సీతారాముల కల్యాణానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, పురుషోత్తం, వడ్ల దశరథం, అవుసుల బ్రహ్మచారి, డాక్టర్ సత్యం, వడ్ల షాములు, దుర్గా గౌడ్, జగన్, చిలుముల సుజాతమ్మ, చిన్నం రెడ్డి, ఉడుత రాజు, మాటూరు శాఖయ్య, పోల నవీన్, సందీప్ కుమార్, శ్రీనివాస్ గుప్తా, సాలె శెట్టయ్య, సత్యనారాయణ, గౌడ్, దుర్గా గౌడ్, బొడ్డు పెంటయ్య, విలేకర్ దుర్గయ్య, విలేకర్ సంతోష్, తోటి విలేకరులు గ్రామ పెద్దలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు

Advertisement

Read more: Read Today’s Latest Telangana E-paper News

Advertisement
Advertisement

About Shiva

Shiva leads Telanganapatrika with a mission to deliver powerful, people-centric Telugu news. With a sharp focus on Telangana’s students, and public issues, and trending schemes, Shiva ensures every update is timely, SEO-rich, and socially impactful. Passionate about accessible journalism, Shiva blends clarity with digital strategy to make Telanganapatrika a trusted voice for today's generation.

View all posts by Shiva →