Telangana School Meals: తెలంగాణ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి గత కొన్ని నెలలుగా నిధుల లోటు సమస్య ఎదురవుతోంది. అయితే తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ₹44.91 కోట్లతో పాఠశాలలకు పెద్ద ఊరట లభించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన వంట ఖర్చులు, హెల్పర్ల చెల్లింపుల కోసం ఈ మొత్తం వినియోగించబడనుంది.

సర్కార్ విడుదల చేసిన మొత్తం నిధుల్లో ₹34.91 కోట్లు వంట ఖర్చులకు, మరో ₹10 కోట్లు కమ్యూనిటీ కుకింగ్ హెల్పర్లకు కేటాయించారు. ప్రతి హెల్పర్‌కు రెండు నెలల పాటు ₹1,000 చొప్పున చెల్లించనున్నారు.
జిల్లాల వారీగా చూస్తే, విద్యార్థుల నమోదు ఆధారంగా మొత్తాలు వేరువేరుగా ఉన్నాయి. హైదరాబాద్‌కు ₹1.63 కోట్లు, రంగారెడ్డికి ₹2.32 కోట్లు, సంగారెడ్డికి ₹2.24 కోట్లు కేటాయించారు. మెడ్చల్, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, నల్గొండ వంటి జిల్లాలు ₹1 కోటి నుంచి ₹1.6 కోట్ల మధ్య నిధులు పొందాయి. చిన్న జిల్లాలకు ₹40 లక్షల నుంచి ₹80 లక్షల వరకు కేటాయింపులు జరిగాయి. మొత్తం 33 జిల్లాల కలిపి విడుదల చేసిన మొత్తం ₹44,91,48,486.
జిల్లా విద్యా అధికారులు ఈ నిధులను Public Financial Management System (PFMS) ద్వారా మండల స్థాయిలో ఉన్న పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అకౌంట్స్ అధికారి SNA అకౌంట్లకు మొత్తం జమ చేసి, వెంటనే జిల్లా కార్యాలయాలకు పంపించాలని సూచించారు. జిల్లాల నుంచి రీలీజ్ ఆర్డర్లు వెలువడిన తర్వాత, పాఠశాలలకు నిధులు చేరనున్నాయి.
Telangana School Meals
ఈ నిధుల విడుదలతో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం సజావుగా కొనసాగేందుకు అవసరమైన ఆర్థిక సమస్యలు తాత్కాలికంగా పరిష్కారం కానున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
