Reliance Jio: రిలయన్స్ జియో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి తన ఆధిపత్యాన్ని నిరూపించింది. 2025 సెప్టెంబర్ నెలలో జియో వైర్‌లైన్ (బ్రాడ్‌బ్యాండ్) మరియు వైర్‌లెస్ (మొబైల్) విభాగాల్లో అత్యధిక వినియోగదారులను చేర్చుకుని అగ్రస్థానంలో నిలిచింది.

వైర్‌లైన్ విభాగంలో జియో సత్తా
జియోఫైబర్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌తో, కంపెనీ వైర్‌లైన్ వినియోగదారుల సంఖ్యను ఆగస్టులో ఉన్న 17.87 లక్షల నుండి 18.28 లక్షలకు పెంచుకుంది.
అంటే కేవలం ఒక నెలలోనే 40,641 కొత్త వినియోగదారులు జియో సేవలు ఎంచుకున్నారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీకి జియోఫైబర్ ప్రధాన ఎంపికగా మారిందని సంస్థ తెలిపింది.
ఇతర కంపెనీల పరిస్థితి
భారతి ఎయిర్‌టెల్ వైర్‌లైన్ విభాగంలో 12,043 వినియోగదారులను చేర్చుకోగా, బీఎస్ఎన్ఎల్ స్వల్ప వృద్ధి సాధించింది. మరోవైపు, వోడాఫోన్ ఐడియా మాత్రం వినియోగదారులను కోల్పోయి 1,300 మంది సబ్స్క్రైబర్లు తగ్గింది.
మొబైల్ సర్వీసుల్లో జియో ఆధిపత్యం
జియో మొబైల్ సర్వీసుల్లో కూడా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2025 సెప్టెంబర్ చివరి నాటికి జియో 1.17 లక్షల కొత్త మొబైల్ వినియోగదారులను చేర్చుకుని, మొత్తం సబ్‌స్క్రైబర్ బేస్‌ను 3.18 కోట్లకు పెంచుకుంది. ఎయిర్‌టెల్ కూడా స్వల్ప వృద్ధితో 39,000 కొత్త వినియోగదారులను చేర్చుకుంది.
బీఎస్ఎన్ఎల్ గ్రామీణ ప్రాంతాల్లో చవక ధర ప్లాన్‌లతో 80,000 మంది కొత్త వినియోగదారులను పొందగా, వోడాఫోన్ ఐడియా మాత్రం 70,000 మంది వినియోగదారులను కోల్పోయింది.
Reliance Jio జియో వృద్ధి వెనుక ఉన్న కారణాలు
జియో యొక్క వేగవంతమైన ఇంటర్నెట్, విస్తృత కవరేజ్, చవక ధర ప్యాక్‌లు, మరియు విశ్వసనీయ కస్టమర్ సపోర్ట్ కారణంగా వినియోగదారులు పెరుగుతున్నారని పరిశ్రమ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యేకంగా Tier-II, Tier-III పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో జియో సేవలు ప్రజాదరణ పొందుతున్నాయి.
Read More: Read Today’s E-paper News in Telugu
