Digital Arrest Scam: కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లా సైబర్‌క్రైమ్ పోలీసులు గుజరాత్‌కు చెందిన ఇద్దరిని డిజిటల్ అరెస్ట్ మోసం కేసులో అరెస్ట్ చేశారు. వాట్సాప్ లింక్‌ల ద్వారా ప్రజలను భయపెట్టి, తాము పోలీసులమని చెప్పి డబ్బు వసూలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

అరెస్టయిన వారిని పంకజ్ భాయ్, సల్లూ షైలేష్‌గా గుర్తించారు. వీరి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
రూ.1.66 లక్షలు వసూలు – మొత్తంగా రూ.3.40 లక్షలు మోసం
పోలీసుల వివరాల ప్రకారం, ఈ ఇద్దరు నిందితులు అసిఫాబాద్‌కు చెందిన వ్యక్తిని డిజిటల్‌గా అరెస్ట్ చేస్తామని బెదిరించి, వాట్సాప్ లింక్ ద్వారా రూ.1.66 లక్షలు వసూలు చేశారు. విచారణలో వీరు ఇప్పటివరకు రూ.3.40 లక్షలు వసూలు చేసినట్లు ఒప్పుకున్నారు.
డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?
సైబర్ నేరగాళ్లు తమను పోలీసులు, సీబీఐ అధికారులు అంటూ వాట్సాప్, వీడియో కాల్ ద్వారా బాధితులను భయపెడతారు. తరువాత “డిజిటల్ అరెస్ట్” అనే నకిలీ ప్రక్రియలోకి లాగి, ఖాతాల్లో డబ్బు బదిలీ చేయమని ఒత్తిడి తెస్తారు. ఈ మోసాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్నాయని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Digital Arrest Scam సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరిక
పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు..
“ఏ అధికార సంస్థ కూడా వాట్సాప్ లింక్ లేదా వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయదు. ఇలాంటి సందేశాలు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు సమాచారం ఇవ్వాలి,” అని సూచించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
