GST Telangana: దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 2025లో GST వసూళ్లు సగటున 7% పెరిగినప్పటికీ, తెలంగాణ మాత్రం -5% తగ్గుదలను నమోదు చేసి జాబితాలో చివర్లో నిలిచింది. వినియోగదారుల ఖర్చు తగ్గడం, వ్యాపార కార్యకలాపాల మందగమనం ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

గత ఏడాది మెరుగైన ప్రగతి
2023లో (BRS పాలనలో) తెలంగాణ GST వృద్ధి 33% వరకు పెరిగి దేశంలో అగ్రస్థానంలో నిలిచింది.
2024లో వృద్ధి కేవలం 1% వరకు పడిపోయింది.
2025 సెప్టెంబర్లో అది పూర్తిగా ప్రతికూలం అవుతూ -5%కి చేరింది.
నెలవారీ GST వసూళ్ల మార్పులు
- ఏప్రిల్ – +12%
- మే – +6%
- జూన్ – +8%
- జూలై – +10%
- ఆగస్టు – +12%
- సెప్టెంబర్ – -5%
ఈ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఆందోళనకర పరిస్థితిని ప్రతిబింబిస్తున్నాయి.
GST Telangana రాజకీయ ప్రతిస్పందన
BRS నాయకుడు కేటీఆర్ విమర్శిస్తూ, “రెండు సంవత్సరాల క్రితం తెలంగాణ GST వృద్ధిలో అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు దేశంలోనే దిగువన పడిపోవడం ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యం” అని అన్నారు.
Read More: Read Today’s E-paper News in Telugu
