Telangana Patrika (October 02): Check today rasi phalalu – 02 October 2025 మేషం నుండి మీనం వరకు పూర్తి రాశి ఫలితాలు. ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం గురించి తెలుసుకోండి.

Today Rasi Phalalu: 02 అక్టోబర్ 2025 రాశి ఫలితాలు!
ఈ రోజు గురువారం, 02-10-2025. Today Rasi Phalalu ప్రకారం, గురు దేవుని ఆశీర్వాదంతో కొన్ని రాశులకు శుభ ఫలితాలు లభిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం మరియు ఆరోగ్యంపై ఈ రోజు మీ రాశికి ఏమి చెబుతోందో ఇక్కడ చూడండి.
| అంశం | వివరాలు |
|---|---|
| తేది | గురువారం, అక్టోబరు 2, 2025 |
| సంవత్సరం | శ్రీ విశ్వావసు నామ సంవత్సరం |
| అయనము | దక్షిణాయనం – శరదృతువు |
| మాసం | ఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం |
| తిథి | దశమి – మ. 2:41 వరకు |
| వారం | గురువారం (బృహస్పతివాసరే) |
| నక్షత్రం | ఉత్తరాషాఢ – ఉ. 6:11 వరకు → తదుపరి శ్రవణం |
| యోగం | సుకర్మ – రా. 9:44 వరకు |
| కరణం | గరజి – మ. 2:41 వరకు → తదుపరి వణిజ – రా. 2:37 వరకు |
| వర్జ్యం | ఉ. 10:17 – 11:56 |
| దుర్ముహూర్తము | ఉ. 9:52 – 10:39, మ. 2:37 – 3:25 |
| అమృతకాలం | రా. 8:09 – 9:48 |
| రాహుకాలం | మ. 1:30 – 3:00 |
| యమగండ/కేతుకాలం | ఉ. 6:00 – 7:30 |
| సూర్యరాశి | కన్య |
| చంద్రరాశి | మకరం |
| సూర్యోదయం | ఉ. 5:54 |
| సూర్యాస్తమయం | సా. 5:48 |
| ప్రత్యేకం | విజయదశమి మరియు శమీ పూజ |
| విజయముహూర్తం | మ. 1:50 – 2:38 |
మేషం
చేపట్టిన పనులు సులభంగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలకు ముందు కుటుంబ సలహాలు తీసుకోవడం మంచిది. అవసరానికి డబ్బు సహాయం లభిస్తుంది. వ్యాపార పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
వృషభం
నిరుద్యోగులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. కొత్త వస్తువులు, వాహనాల కొనుగోళ్లు జరుగుతాయి. పాత మిత్రులతో విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
మిథునం
పనులు నెమ్మదిగా సాగుతాయి. కుటుంబ పెద్దలతో మాటపడి చికాకు పెరుగుతుంది. రుణ ఒత్తిడి వల్ల మానసిక స్థిరత్వం లోపిస్తుంది. అవసరం లేకుండా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇంటి బయటా కొత్త సమస్యలు ఉద్భవిస్తాయి. వ్యాపారం స్థిరంగా లేదు. ఉద్యోగ వాతావరణం నిరాశ కలిగిస్తుంది.
కర్కాటకం
సన్నిహితులతో విభేదాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో మాటల తగాదాలు ఉంటాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దైవ సేవలో పాల్గొంటారు. స్వల్ప ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
సింహం
ఇంటి బయట గౌరవం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల నుండి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు వస్తాయి. సంతానం విద్య, ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు వస్తాయి. ఉద్యోగంలో ఆశించిన పదవులు దక్కుతాయి.
కన్య
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మీకు లాభిస్తాయి. డబ్బు వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. బంధువుల నుండి శుభ సమాచారం అందుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనుగోళ్లు సాధ్యమవుతాయి. వ్యాపారంలో కీలక నిర్ణయాలు లాభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల మద్దతు లభిస్తుంది.
తుల
ఖర్చులు ఆదాయాన్ని మించి ఉంటాయి. దూర ప్రయాణాల్లో వాహన ప్రమాదాల ప్రమాదం ఉంది. పనుల్లో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. ఉద్యోగంలో ఇతరుల విమర్శలు ఎదురవుతాయి.
వృశ్చికం
కీలక వ్యవహారాల్లో తొందరపాటు గందరగోళానికి దారితీస్తుంది. మిత్రుల నుండి ఊహించని రుణ ఒత్తిడి వస్తుంది. ఆరోగ్యంపై అశ్రద్ధ చేయకండి. వ్యాపార భాగస్తులతో చిన్న వివాదాలు ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి.
ధనస్సు
అవసరానికి కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. బంధువుల నుండి వివాదాలకు సంబంధించిన ముఖ్య సమాచారం అందుతుంది. వ్యాపార సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు లభిస్తాయి.
మకరం
జీవిత భాగస్వామితో చిన్న వివాదాలు ఏర్పడతాయి. వ్యాపారంలో ఎక్కువ కష్టం, తక్కువ ఫలితం ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. ఉద్యోగంలో స్థానచలన సూచనలు ఉన్నాయి. పాత రుణాల ఒత్తిడి పెరుగుతుంది.
కుంభం
కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.
మీనం
ముఖ్యమైన పనులు కష్టసాధ్యంగా ఉంటాయి. బంధువులతో విభేదాలు తప్పవు. ఆలోచనల్లో స్థిరత్వం లేదు. ఇంటి బయటా చికాకులు పెరుగుతాయి. వ్యాపారం మరింత నెమ్మదిగా సాగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతానం విద్యపై మీ దృష్టి ఉంటుంది.
ప్రతి రోజు మీ రాశి ఫలాలు(Today Rasi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మా తెలంగాణ పత్రిక నీ చూడండి
Disclaimer
రాశిఫలాలు సాధారణ మార్గదర్శకం మాత్రమే. వ్యక్తిగత పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు.
