TGBIE Yoga Classes: తెలంగాణలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఒక కొత్త మార్గం. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TGBIE) అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల్లో వారంలో ఒక పీరియడ్ స్పోర్ట్స్, యోగా, మెడిటేషన్ మరియు ప్రాక్టికల్ క్లాసులు నిర్వహించాలని తప్పనిసరి చేసింది.

TGBIE Yoga Classes ఏం జరుగుతుంది?
ఈ కొత్త ఆదేశం ప్రకారం:
ప్రతి వారం ఒక పీరియడ్ స్పోర్ట్స్ కార్యక్రమాలకు కేటాయించాలి.
మరో పీరియడ్ యోగా మరియు మెడిటేషన్ కార్యక్రమాలకు ఉపయోగించాలి.
మూడవ పీరియడ్ ప్రాక్టికల్ క్లాసులకు కేటాయించాలి.
ప్రాక్టికల్ క్లాసులు ఏమి చేస్తాయి?
ప్రాక్టికల్ క్లాసులు విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచడానికి సహాయపడతాయి. వాటిలో కీలక అంశాలు:
సమాచార సాంకేతిక నైపుణ్యాలు , కమ్యూనికేషన్ స్కిల్స్ ,రెస్యూమ్ రాయడం, పబ్లిక్ స్పీకింగ్
, ఇంటర్వ్యూ టెక్నిక్స్
ప్రయోజనాలు ఏమిటి?
ఈ కొత్త విధానం యొక్క ప్రధాన లక్ష్యాలు:
- విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం.
- జీవిత నైపుణ్యాలను పెంచడం.
- ఉద్యోగ మార్కెట్ కు అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడం.
- పరీక్షల ఒత్తిడి నుండి విద్యార్థులకు ఊరట కలిగించడం.
Read More: Read Today’s E-paper News in Telugu
