24 గంటల్లోనే నిజం బయటపెట్టిన జగిత్యాల పోలీసులు: జగిత్యాల పట్టణం 14 వ తేదీ రాత్రి,ఆటో డ్రైవర్ ఎండీ. నయీముద్దీన్ (50) తన ఆటోలో ప్రయాణికులను తీసుకెళ్తున్న సమయంలో, బీహార్ రాష్ట్రం సంస్తిపూర్ జిల్లాకు చెందిన దర్శన్ సాహ్ని (31),సునీల్ సాహ్ని (41)లు కిరాయి ప్రయాణికులుగా ఎక్కారు.

ప్రయాణంలో కిరాయి చెల్లింపు విషయమై డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగిన నిందితులు, డబ్బు ఇవ్వకుండా గొడవ చేసి, మృతుడి మెడను గుడ్డతో నులిమి, అనంతరం బండరాయితో దాడి చేసి క్రూరంగా హత్య చేశారు.హత్య అనంతరం మృతుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను దోచుకుని, అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనపై కేసు నం 391/2025, 103(1) బి ఎన్ ఎస్ కింద నమోదు చేసి, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఆధారాలను సేకరించి, తక్షణమే నిందితులను పట్టుకున్నారు.వారి వద్ద నుంచి హత్య సమయంలో ఉపయోగించిన రక్తపు మరకలున్న దుస్తులు, దొంగిలించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.పై కేసును 24 గంటల్లో చేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో కృషి చేసిన రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, రూరల్ ఎస్సై సధాకర్, వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ అభినందించారు.
Read More: Read Today’s E-paper News in Telugu
