Telanganapatrika : Vastu Tips For Ganesh Chaturthi | గణేష్ చతుర్థి హిందూ పండుగల్లో ఒక ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఘనంగా జరుపుకోవడానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం 2025 ఆగస్టు 27న గణేష్ చతుర్థి పండుగ జరగనుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో భక్తులు గణపతిని విభిన్న రూపాల్లో ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు. చివరలో నదులు, చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.

Vastu Tips For Ganesh Chaturthi | ఇంట్లో గణపతి ఉంచే సరైన దిశ
హిందూ మతంలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన్ని “ఆదిదేవుడు” అని పిలుస్తారు. ప్రతి శుభకార్యం వినాయకుడి పూజతోనే ప్రారంభమవుతుంది. గణేష్ చవితి రోజున ఇళ్లలో, మండపాల్లో విగ్రహాలను ప్రతిష్టించి రోజూ ప్రత్యేక పూజలు చేస్తారు.
Vastu Tips For Ganesh Chaturthi వాస్తు ప్రకారం వినాయక విగ్రహం ఏ దిశలో ఉంచాలి?
- ఈశాన్య దిశ
వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచితే అత్యంత శుభం. దీని వలన సంపద, ఆరోగ్యం, శాంతి కలుగుతాయి. - తూర్పుదిశ
విగ్రహాన్ని తూర్పుదిశలో ఉంచినా సానుకూల ఫలితాలు వస్తాయి. - పశ్చిమం & దక్షిణం
వాస్తు ప్రకారం గణేష్ విగ్రహాన్ని పశ్చిమం లేదా దక్షిణ దిశలో ఉంచడం అశుభం. దీని వలన ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చని పండితులు హెచ్చరిస్తున్నారు.
గణపతి తొండం – ఎడమ వైపు లేదా కుడి వైపు?
వినాయకుడి విగ్రహం ఎంచుకోవడంలో తొండం దిశపై చాలా మందికి సందేహాలు ఉంటాయి.
సాధారణంగా ఎడమ వైపు తొండం ఉన్న విగ్రహమే శుభప్రదం. ఇది శాంతి, శ్రేయస్సు, సౌఖ్యం ఇస్తుంది.
ఒకవేళ కుడి వైపు తొండం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టిస్తే, ప్రత్యేక నియమాలు, నియంత్రణలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే ఫలితాలు ప్రతికూలంగా మారవచ్చని పండితులు చెబుతున్నారు.
Vastu Tips For Ganesh Chaturthi గణేష్ విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలి?
విగ్రహం ఎల్లప్పుడూ ఇంటి పూజ గదిలో ఉంచాలి.
మట్టి విగ్రహమే ఎంచుకోవాలి , గణేష్ విగ్రహంతోపాటు లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంటే సంపద, శ్రేయస్సు మరింతగా పెరుగుతుందని నమ్మకం.
గణపతి పూజ వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, భక్తులకు దైవ ఆశీస్సులు లభిస్తాయి.
Read More: Read Today’s E-paper News in Telugu