Telanganapatrika (August 19): Hyderabad Cable Internet Wires Removal,హైదరాబాద్ నగరంలో విద్యుత్ స్తంభాలపై అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కేబుల్, ఇంటర్నెట్ వైర్లు తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు TGSPDCL సిబ్బంది యుద్ధప్రాతిపదికన ఈ చర్యలు చేపట్టారు.

Hyderabad Cable Internet Wires Removal
ఏడాది గడువు ఇచ్చినా స్పందన లేదు
ఆపరేటర్లకు గతంలో ఒక సంవత్సరం సమయం ఇచ్చినా, వారు స్పందించకపోవడంతో భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం సరైంది కాదు” అని ఆయన హెచ్చరించారు.
మీ ఇంటర్నెట్ వైర్లు కట్ చేశారా?
ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో కేబుల్, ఇంటర్నెట్ కనెక్షన్లు నిలిచిపోతుండగా, ప్రజలు సోషల్ మీడియాలో తమ అనుభవాలు పంచుకుంటున్నారు. మరి మీ ఇంటర్నెట్ లేదా కేబుల్ వైర్లు కూడా కట్ అయ్యాయా?
Read More: Read Today’s E-paper News in Telugu