Telanganapatrika (August 16): Iphone hacking rewards , కోడింగ్‌లో నైపుణ్యం ఉందా? యాపిల్ సెక్యూరిటీ బౌంటీ ప్రోగ్రామ్‌లో పాల్గొని, ఐఫోన్ భద్రతా లోపాలను కనుగొంటే రూ.17 కోట్ల వరకు బహుమతి గెలుచుకోవచ్చు. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Iphone hacking rewards యాపిల్ సెక్యూరిటీ చాలెంజ్
కోడింగ్‌లో ప్రతిభ చూపే వారికి ఇప్పుడు యాపిల్ ఒక అద్భుతమైన ఛాన్స్ ఇస్తోంది. యాపిల్ సెక్యూరిటీ బౌంటీ ప్రోగ్రామ్ కింద, ఐఫోన్ భద్రతను ఛేదించి లోపాలను గుర్తించగలిగితే, కోటీశ్వరులు కావచ్చు.
ఈ ప్రోగ్రామ్ 2022లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లు, కోడర్లు ఇందులో పాల్గొంటున్నారు.
బహుమతి ఎంతవరకు దక్కుతుంది?
ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, బహుమతి మొత్తం $5,000 (రూ.4.37 లక్షలు) నుంచి $2 మిలియన్ (రూ.17.49 కోట్లు) వరకు ఉంటుంది. మీరు కనుగొనే భద్రతా లోపం ఎంత ప్రమాదకరమో బట్టి రివార్డ్ నిర్ణయిస్తారు.
బహుమతుల కేటగిరీలు
ఫిజికల్ యాక్సెస్ హ్యాక్ → రూ.2.18 కోట్లు వరకు
ఇన్‌స్టాల్ చేసిన యాప్ ద్వారా దాడి → రూ.1.31 కోట్లు వరకు
నెట్‌వర్క్ దాడి → రూ.2.18 కోట్లు వరకు
జీరో-క్లిక్ దాడి → రూ.8.74 కోట్లు వరకు
ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ రిమోట్ హ్యాక్ → రూ.8.74 కోట్లు వరకు
గ్రాండ్ ప్రైజ్ – రూ.17 కోట్లు!
ఐఫోన్‌లోని అత్యంత సెక్యూర్ ఫీచర్ లాక్‌డౌన్ మోడ్ను ఛేదించగలిగితే, రూ.17.49 కోట్ల గ్రాండ్ ప్రైజ్ మీ సొంతం. ఈ ఫీచర్‌ను డిజిటల్ బెదిరింపుల నుండి యూజర్ల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొందించారు.
Iphone hacking rewards కోడర్లకు గోల్డెన్ ఛాన్స్
కోడింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్‌లో నైపుణ్యం ఉన్నవారికి ఇది కెరీర్ మేకింగ్ ఆప్షన్.
యాపిల్ సిస్టమ్‌ను సురక్షితంగా ఉంచడంలో భాగస్వాములు కావడమే కాకుండా, కోట్లలో బహుమతి గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది.
Read More: Read Today’s E-paper News in Telugu