Telanganapatrika (August 16): మిడ్ మానేరు జలాశయం వేములవాడ అర్బన్ మండలంలోని రుద్రవరం, చీర్లవంచకు చెందిన మత్స్యకారులు, 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకున్నారు.

మిడ్ మానేరు జలాశయం మత్స్యకారుల వినూత్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
దేశభక్తిని ప్రతిబింబించేలా, వారు శ్రీ రాజరాజేశ్వరి మిడ్ మానేరు జలాశయం మధ్యలో పడవలోకి వెళ్లి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.
మత్స్యకారులు మాట్లాడుతూ –
“ప్రతి సంవత్సరం మాకు జీవనాధారమైన ఈ జలాశయంలోనే జాతీయ పతాకాన్ని ఎగురవేస్తూ, దేశభక్తిని ప్రదర్శిస్తాం” అని తెలిపారు.
ఈ వినూత్న కార్యక్రమం స్థానిక ప్రజలను ఆకట్టుకోగా, పలువురు వీరి దేశభక్తిని అభినందించారు.
Read More: Read Today’s E-paper News in Telugu