Veenavanka police, వీణవంక మండలంలోని హిమ్మత్ నగర్ గ్రామస్తులు గత 34 రోజులుగా కొండపాక క్వారీలలో ఇసుక లారీలపై పర్దాలు కప్పెందుకు గ్రామస్తుల ఉపాధికై, సామూహిక రిలే నిరాహార దీక్షలు చేపట్టగా, మంగళవారం హుజురాబాద్ ఏసిపి మాధవి ఇరు గ్రామాలైన కొండపాక, హిమ్మత్ నగర్ గ్రామ పెద్దలను సమావేశపరిచి, ప్రస్తుత క్వారీ ప్రభుత్వ పనుల నిమిత్తం నడుస్తుందని,ఇరు గ్రామాల నాయకులతోసుదీర్ఘంగా చర్చించి, ఇరు గ్రామాల వారు తొందరపడవద్దని, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని, ఇరు గ్రామాల వారు ఎప్పటిలాగే అన్నదమ్ములగా కలిసి ఉండాలని, ఎలక్షన్లు అయ్యేంతవరకు, కొండపాక గ్రామస్తులు ఇసుక లారీలపై పరదాలు కట్టవద్దని, అప్పటివరకు హిమ్మత్ నగర్ గ్రామస్తులు ఎలాంటి ధర్నాలను,.

రాస్తారోకో లను, దీక్షలను చేయవద్దని, గ్రామాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి గ్రామ పౌరులుగా, మాజీ ప్రజా ప్రతినిధులుగా మీ గ్రామాల ప్రజలకు, ప్రభుత్వానికి, అధికారులకు,పోలీస్ శాఖకు మీ సహాయ సహకారాలు ఉండాలని, మీ కర్తవ్యం గా భావించి గ్రామాలలో ఎల్లప్పుడూ శాంతి భద్రతలు కాపాడడానికి మీ వంతు సహకారాలు అందించాలన్నారు. ఇరు గ్రామాల నాయకులు చర్చల్లో సానుకూలంగా స్పందించారు.అనంతరం ఇరు గ్రామాల నాయకుల పట్ల హుజురాబాద్ ఏసిపి సంతృప్తిని వ్యక్తపరిచారు.ఈ సమావేశంలో ఎసిపి మాధవి తో పాటుగా జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి, కొండపాక, హిమ్మత్ నగర్ గ్రామాల మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువ నేతలు తదితరులు పాల్గొన్నారు