Telanganapatrika (August 12): WhatsApp Block, ప్రతి నెల WhatsApp లక్షలాది అకౌంట్లను నిబంధనలు ఉల్లంఘించినందుకు బ్లాక్ చేస్తోంది. జూన్ 2025లో మాత్రమే 98 లక్షల ఖాతాలు తొలగించబడ్డాయి.

WhatsApp Block ఎందుకు చేస్తుంది..?
- ఫేక్ న్యూస్ లేదా మిస్ ఇన్ఫర్మేషన్ పంపడం
- మాల్వేర్, స్పామ్ లింకులు షేర్ చేయడం
- విద్వేష ప్రచారం (Hate Speech)
- మానవ అక్రమ రవాణా, ఫ్రాడ్ యాక్టివిటీస్
- ఫేక్ ప్రొఫైళ్లు ఉపయోగించడం
- యూజర్ కంప్లైంట్ల ఆధారంగా చర్యలు
ఖాతా బ్లాక్ అయినప్పుడు వచ్చే నోటిఫికేషన్..
- యాప్ ఓపెన్ చేసినప్పుడు “Your WhatsApp account is banned” వంటి మెసేజ్ వస్తుంది.
- కారణం: WhatsApp పాలసీ ఉల్లంఘన, సమాజానికి హానికరమైన కంటెంట్ పంపడం మొదలైనవి.
Read More : Whatsapp document scanning: మీ మొబైల్‌కే స్కానర్ వచ్చేసింది! WhatsApp డాక్యుమెంట్ స్కానింగ్ ఫీచర్.
పొరపాటున బ్లాక్ అయితే ఏం చేయాలి..?
1. WhatsApp Support ను సంప్రదించండి
- యాప్‌లో Help → Contact Us ఎంపికను ఉపయోగించండి.
- సమస్య వివరాలు, మీ ఫోన్ నంబర్ (+91 సహా), బ్లాక్ కారణం అని అనుకుంటున్న వివరాలు ఇవ్వండి.
2. ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయండి
- support@whatsapp.com కి మెసేజ్ పంపండి.
- వివరంగా మీ సమస్యను రాయండి.
3. తాత్కాలికబ్యాన్ అయితే
- ఈ బ్యాన్ సాధారణంగా 24 గంటల నుండి 30 రోజుల లోపు తొలగించబడుతుంది.
- ఈ సమయంలో GBWhatsApp, WhatsApp Plus వంటి థర్డ్-పార్టీ యాప్‌లు వాడకండి.
4. ముఖ్యమైన జాగ్రత్తలు
- WhatsApp యొక్క అధికారిక వెర్షన్ మాత్రమే వాడాలి.
- అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో బ్రాడ్‌కాస్ట్ మెసేజ్‌లు పంపొద్దు.
- హానికరమైన, ఫేక్ లేదా అభ్యంతరకరమైన కంటెంట్ షేర్ చేయవద్దు.
Read More: Read Today’s E-paper News in Telugu