Telanganapatrika (August 10): Revanth Reddy Cabinet Decisions, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రభుత్వం కీలకమైన చట్టపరమైన మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునే దశాబ్దాల నాటి నిబంధనను రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది.

Revanth Reddy Cabinet Decisions ఏం మార్చబోతున్నారు..?
- తెలంగాణ పంచాయితీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 21(3) తొలగింపు ప్రతిపాదన
- 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి వచ్చిన ఈ పరిమితిని రద్దు చేయాలని మంత్రులు ఏకగ్రీవ మద్దతు తెలిపారు
- రాబోయే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు
ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారు..?
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 42%కు పెంచే ప్రణాళిక
- మరిన్ని వర్గాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశాలు పెరగడం
- పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటికే ఈ నిబంధన రద్దు కావడంతో, గ్రామీణ అభ్యర్థులపై వివక్ష తొలగించడం
- ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఇప్పటికే ఈ నిబంధన తొలగించడం
Revanth Reddy Cabinet Decisions పరిస్థితుల నేపథ్యం..
2026లో డీలిమిటేషన్ ఫ్రీజ్ ముగిసిన తర్వాత, జనాభా నియంత్రణలో విజయవంతమైన రాష్ట్రాలు రాజకీయ ప్రభావం, కేంద్ర నిధులు కోల్పోవచ్చనే ఆందోళన..
తెలంగాణ హైకోర్టు గతంలో ఈ నిబంధనను సమర్థించినా, దీన్ని కొనసాగించాలా లేదా రద్దు చేయాలా అనేది ప్రభుత్వ నిర్ణయం అని పేర్కొనడం…
వృద్ధాప్య జనాభా పెరుగుదల, యువతరాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం నేపథ్యంలో మార్పు అవసరమనే అభిప్రాయం…
Read More: Read Today’s E-paper News in Telugu
One Comment on “Revanth Reddy Cabinet Decisions : గ్రామ పంచాయతీ ఎన్నికలు కీలక రూల్ రద్దు..?”