Telanganapatrika (August 10): Indiramma Indlu Bill Status Telangana, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇకపై ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అప్డేట్ చేసి, బిల్లుల ప్రోగ్రెస్, చెల్లింపు స్థితి వంటి వివరాలను ఆన్‌లైన్‌లోనే తెలుసుకునే సౌకర్యం కల్పించింది.

Indiramma Indlu Bill Status Telangana ఏమేం వివరాలు తెలుసుకోవచ్చు.?
- బిల్లు ఎక్కడి వరకు విడుదలైంది?
- చెల్లింపు ఏ కారణంతో ఆగిపోయింది?
- ఎన్ని విడతలు వచ్చాయి?
- మిగిలిన మొత్తం ఎంత?
లాగిన్ చేసేందుకు అవసరమయ్యేది:
లబ్ధిదారు ఈ క్రింది ఏదైనా వివరంతో లాగిన్ కావచ్చు..
- ఫోన్ నంబర్
- ఆధార్ నంబర్
- రేషన్ కార్డు నంబర్
- అప్లికేషన్ నంబర్
ఇప్పటివరకు ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి?
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల ఇళ్లు మంజూరు అయ్యాయి.
ప్రతి ఇల్లు నిర్మాణానికి ₹5 లక్షలు మంజూరు అవుతాయి.
ఈ మొత్తాన్ని 4 విడతల్లో విడుదల చేస్తారు.
అధికారిక వెబ్సైటు కోసం..https://indirammaindlu.telangana.gov.in/
Read More: Read Today’s E-paper News in Telugu