Telanganapatrika (August 07): UPI Charges 2025 , యూపీఐ (UPI – Unified Payments Interface) భారతదేశంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. కూరగాయలు కొనడం నుండి పెద్ద షాపింగ్ వరకూ – అన్ని చోట్లా “స్కాన్ చేసి పేమెంట్” అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఉచితంగా లావాదేవీలు జరిగాయి. కానీ ఇకపై యూపీఐ ఫ్రీగా ఉండకపోవచ్చు అని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర పేర్కొన్నారు.

UPI Charges 2025 యూపీఐకి ఖర్చు ఉందా?
ద్రవ్య విధాన కమిటీ సమావేశం అనంతరం గవర్నర్ చేసిన ప్రకటనలో, “యూపీఐ సేవల నిర్వహణకు ఖర్చు ఉంది. ఎవరో ఒకరు ఆ ఖర్చును భరించాలి. సబ్సిడీ ద్వారా ఇది ఇప్పటివరకు నడుస్తోంది, కానీ దీర్ఘకాలంగా ఇది సాధ్యపడదు” అని వ్యాఖ్యానించారు.
అంటే – భవిష్యత్తులో కస్టమర్లు కొంతవరకు ఛార్జీలు చెల్లించాల్సిన అవకాశం ఉంది.
UPI Charges 2025 ICICI బ్యాంక్ ఇప్పటికే మొదలుపెట్టింది..
తాజాగా ICICI బ్యాంక్, UPI లావాదేవీలపై అగ్రిగేటర్‌లకు చిన్న మొత్తంలో ఛార్జీలు వేయడం ప్రారంభించింది.
ప్రతి రూ.100 లావాదేవీకి 2 పైసలు, గరిష్టంగా రూ.6 వరకూ వసూలు చేయనుంది.
ఎస్క్రో ఖాతా లేకుండా లావాదేవీ జరిగితే గరిష్టంగా రూ.10 ఛార్జ్ ఉంటుంది.
Read More: Read Today’s E-paper News in Telugu